సినీ ఇండస్ట్రీలో లడ్డూ లొల్లి.. తన్నుకుంటున్న రెండు వర్గాలు!

తిరుపతి లడ్డూ వివాదం సినీ ఇండస్ట్రీలో మంటలు రేపుతోంది. పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సనాతన ధర్మం గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడవద్దని పవన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఎవరి నమ్మకాలు వారివంటూ ప్రకాశ్‌రాజ్‌ కౌంటర్ రిప్లై ఇచ్చారు.

New Update
drerse

Laddu: లడ్డూ లొల్లి రచ్చకెక్కుతోంది. ఇది సినీ ఇండస్ట్రీలో మంట పెడుతోంది. తిరుమల దేవుడి లడ్డూలో పంది కొవ్వు కలిపారని టీడీపీ నేతలు ఆరోపించడం, ఆ వెంటనే ఓ రిపోర్టును బయటపెట్టడంతో మొదలైన వివాదం అంతకంతకూ ముదురుతోంది. ట్విట్టర్‌లో ఇప్పటికే తెలుగు ప్రజలు రెండు వర్గాలుగా చీలి మరి తన్నుకుంటున్నారు. మరోవైపు సినీ సెలబ్రెటీలు ఈ విషయంలో గొడవ పడుతున్నారు. ముఖ్యంగా నాస్తిక ప్రకాశ్‌రాజ్‌పై దేవుడి భక్తులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇటు పవన్‌ ప్రకాశ్‌రాజ్‌తో పాటు తమిళ హీరో కార్తీపైనా విరుచుకుపడ్డారు.

ల‌డ్డూ కావాలా నాయ‌నా..

కార్తీ న‌టించిన మూవీ 'స‌త్యం సుంద‌రం' ఈ నెల సెప్టెంబ‌ర్ 28న విడుదలకానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చారు కార్తీ. ఈ ఈవెంట్‌లో 'ల‌డ్డూ కావాలా నాయ‌నా.. ఇంకో ల‌డ్డూ కావాలా నాయ‌నా' అంటూ ఓ యాంక‌ర్ కార్తీని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు వెంటనే ఆన్సర్‌ ఇచ్చారు కార్తీ. ఇది చాలా సెన్సెటివ్‌ టాపిక్‌ అని.. ఈ సమయంలో ఇది మాట్లాడవద్దని సమాధానం ఇచ్చారు. అయితే ఇలా సమాధానం ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు పవన్‌ కల్యాణ్. ల‌డ్డూ టాఫిక్‌ సెన్సిటివ్ కాదుని.. ఎవ్వరూ అలా అనొద్దని చెబుతున్నారు. ఇక పవన్‌ మాటలకు కార్తీ ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. తప్పుగా అర్థం చేసుకోవద్దని.. ఏదైనా పోరపాటుగా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరారు.

లేనిపోని భయాలను సృష్టిస్తూ..

తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలసిందన్న రిపోర్టుపై పవన్‌ సెప్టెంబర్ 20న ఓ ట్వీట్‌ చేశారు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. దీనికి కౌంటర్‌గా ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ చేశారు. లేనిపోని భయాలను సృష్టిస్తూ జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారని ప్రకాశ్‌రాజ్‌ ప్రశ్నించారు. అయితే ఈ ట్వీట్‌కు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. తిరుమల లడ్డూ లక్షల మందికి ప్రసాదం మాత్రమే కాదు, నమ్మకం కూడా అని కౌంటర్‌ ఇచ్చారు. అయితే ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయని ప్రకాశ్‌రాజ్‌ విష్ణుకు కౌంటర్ రిప్లై ఇచ్చారు.

నోటికొచ్చినట్టుగా మాట్లాడొద్దు..

ఈ వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. ప్రకాశ్‌రాజ్‌ కామెంట్స్‌ను ఖండిస్తూ జనసైనికులు ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కొందరు హద్దుమీరి కామెంట్స్‌ చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రకాశ్‌రాజ్‌పై పవన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది హిందువుల ప్రసాదం అపవిత్రమైతే, ఒక్కరు కూడా మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. అలా మాట్లాడటం సెక్యులర్ వ్యవస్థకు విఘాతమంటే ఎలా అని క్వశ్చన్ చేశారు. సనాతన ధర్మం గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడవద్దని పవన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇలా సినీ సెలబ్రెటిలు తిరుమల లడ్డూ విషయంలో వాదించుకోవడం, తిట్టుకోవడం ఆసక్తిని రేపుతోంది.

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు