Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. వాటిలో ఒకటి 'హరిహర వీరమల్లు'. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసిన ఈ భారీ యాక్షన్ డ్రామా షూటింగ్ ముగింపుకి దశకు చేరుకుంది. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. దీంతో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్.
ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!
Get ready for a blast of mass beats and the ultimate swag of Powerstar @PawanKalyan! 🔥#HHVM 2nd Single song promo is out now ❤️🔥#Kollagottinadhiro - https://t.co/3O4MeCXMaE#UdaaKeLeGayi - https://t.co/ssk1LrWdH4#EmmanasaParichutta - https://t.co/d2hDkTTyRZ… pic.twitter.com/mY5tbHnMPo
— Hari Hara Veera Mallu (@HHVMFilm) February 21, 2025
సెకండ్ సింగిల్
ఇందులో భాగంగా ఇటీవలే ఫస్ట్ సింగిల్ 'మాట వినాలి' సాంగ్ రిలీజ్ చేయగా .. తాజాగా మరో పాటను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టినాదిరో' పాటను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్, మంగ్లీ వాయిస్ తో పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది సాంగ్. ఫుల్ సాంగ్ 24న మధ్యాహ్నం 3గంటలకు రానుంది. ఈ పాటలో యాంకర్ అనసూయ స్పెషల్ అపియరెన్స్ గా కనిపించబోతుంది. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'హరిహర వీరమల్లు' 2025 మార్చి 28న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..