/rtv/media/media_files/2025/02/20/CQ3cNS0r7Q1HxSEyXhLG.jpg)
odela 2 teaser at kumbha mela
Odela 2 Teaser: సూపర్ హిట్ నేచురల్ థ్రిల్లర్ 'ఓదెల' ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఓదెల2'. ఈ సీక్వెల్ లో స్టార్ హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండడంతో విపరీతమైన బజ్ నెలకొంది. ఇందులో తమన్నా నాగసాధువుగా కనిపించనుంది. అయితే తాజాగా ఈమూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
#Odela2 Teaser will be launched at the divine atmosphere of the Maha Khumb Mela in Prayagraj #Odela2Teaser out on February 22nd
— TrackTollywood (@TrackTwood) February 19, 2025
Soon in cinemas nationwide.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ihebahp @ImSimhaa @AJANEESHB pic.twitter.com/df3b73h4sO
మహాకుంభమేళాలో టీజర్
ఓదెల2 టీజర్ ను ఈనెల 22న ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తమన్నా పోస్టర్ రిలీజ్ చేశారు. కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో నాగసాధు గా తమన్నా లుక్ పవర్ ఫుల్ గా కనిపించింది. మహాకుంభమేళాలో లాంచ్ కానున్న మొదటి టీజర్ ఓదెల 2 కావడం విశేషం. గతంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను వారణాసిలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం
అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఓదెల అనే ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా 2022 లో విడుదలైన ఓదెల పార్ట్ 1 సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ఓదెల 2 తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా, వశిష్ట ఎన్. సింహా, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఎలా కాపాడారు? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది.
Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!