'దేవర' పార్ట్-2 అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆనందంలో ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఓ హాలీవుడ్ ఇంటర్వ్యూలో 'దేవర' పార్ట్ 2 గురించి మాట్లాడారు. దేవర రిజల్ట్ బాగుంది, పార్ట్ 2 కథ కూడా రెడీగా ఉంది, దానిలో కొన్ని మార్పులు చేయాలి. ఆల్రెడీ రెండు సీన్స్ కూడా షూట్ చేశాం. 'దేవర 2' పార్ట్ 1 కంటే గొప్పగా ఉంటుందని అన్నారు. By Anil Kumar 05 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కిన 'దేవర' మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రిలీజ్ రోజు మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా మెల్ల మెల్లగా పాజిటివ్ టాక్ తో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. మొదటి రోజే రూ.172 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ ఇప్ప్పటి దాకా రూ.405 కోట్ల కలెక్షన్స్ సాధించింది. రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ.360 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి.. వీకెండ్ పూర్తవ్వకముందే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. దీంతో మూవీ టీమ్ ఇటీవల సక్సెస్ మీట్ సైతం నిర్వహించింది. ఇదిలా ఉంటే తారక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'దేవర' పార్ట్-2 పై అప్డేట్ ఇచ్చాడు. #Devara Part 2 will be BIGGER & BETTER 🔥🔥🔥🤙🏻🤙🏻🤙🏻🥵🔥🔥🔥🔥 pic.twitter.com/7FST6plwi3 — 𝐔𝐦𝐚𝐫 '𝐍𝐓𝐑' (@RavanUmar) October 5, 2024 పార్ట్- 2 నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.. దేవర రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ కోసం అమెరికాకు వెళ్లిన ఎన్టీఆర్.. అక్కడ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో 'దేవర' పార్ట్ 2 గురించి మాట్లాడారు." దేవర రిజల్ట్ బాగుంది, పార్ట్ 2 కథ కూడా రెడీగా ఉంది, దానిలో కొన్ని మార్పులు చేయాలి. Part 2 🏌️🏌️🏌️🏌️🥁🥁💥💥pic.twitter.com/fcsMs7hMTr — Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) October 4, 2024 దేవర పార్ట్ 2లో రెండు సీన్స్ కూడా షూట్ చేసాము. అన్ని వదిలేసి ఓ నెల రోజులు రెస్ట్ తీసుకో అని డైరెక్టర్ కొరటాల శివకు చెప్పాను. ఆ తర్వాత 'దేవర 2' మీద ఫోకస్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా గొప్పగా ఉంటుంది.." అని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. #devara #ntr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి