/rtv/media/media_files/2025/02/14/P6QAEEZiitkp6G64aKOL.jpg)
Robinhood Second Song
Robinhood Second Song: నితిన్(Nitin), శ్రీలీల(Sreeleela) జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్’ (Robinhood) మూవీ నుండి సెకండ్ సింగల్ ‘వేరెవర్ యూ గో’ (Wherever You Go) సాంగ్ లిరికల్ వీడియోను మహేశ్ బాబు (Mahesh Babu) సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పాటను విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటని అర్మాన్ మాలిక్ పాడారు. జీవీ ప్రకాశ్‌కుమార్(GV. Prakash Kumar) ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ మూవీ మార్చి 28న విడుదలకు సిద్ధం అవుతోంది.
Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!
'వేరెవర్ యూ గో'...
ప్రేమికుల రోజు కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు 'వేరెవర్ యూ గో' పాటను లాంచ్ చేసారు. సాంగ్ సూపర్ గా ఉందంటూ 'రాబిన్ హుడ్' టీం మొత్తానికి మహేష్ తన బెస్ట్ విషెస్ తెలిపారు. 'గుచి గుచి బేబీ.. నువ్వు గుచ్చి గుచ్చి చూడొద్దే.. లిటిల్ హార్ట్ గిచ్చి పోవద్దే' అంటూ సాగిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బ్రాండ్ పేర్లతో బ్రాండ్ న్యూ స్టైల్ లో ఉన్న ఈ సాంగ్ మీరూ చూసేయండి.
Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?
Also Read: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. మున్షీ ఔట్.. కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరంటే?
Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!