Robinhood : నితిన్ 'రాబిన్ హుడ్' రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?

నితిన్ 'రాబిన్ హుడ్' మూవీ రిలీజ్ వాయిదా పడింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా వాయిదా పడినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని తెలిపారు.

New Update
robinhood

'భీష్మ' లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత నితిన్ - వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాబిన్ హుడ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ యేర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవ‌లే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

Also Read :  అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వస్తున్న పవన్..!

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా క్రిస్మస్ కు రావట్లేదు. 'రాబిన్ హుడ్' మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.

Also Read :  మరోసారి షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్..!

నితిన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..

' కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా 'రాబిన్ హుడ్' చిత్రాన్ని అనుకున్న సమయానికి డిసెంబర్ 25 న రిలీజ్ చేయలేకపోతున్నాం. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ ఉత్సాహాన్ని ఇంకాస్త సమయం ఓపిక పట్టండి. ఈ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ థియేటర్లలోకి వచ్చినప్పుడు మీకు కచ్చితంగా మరపురాని అనుభూతినిస్తుంది..' అని ప్రకనటలో తెలిపారు. 

Also Read :  రాష్ట్రపతి రాకతో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లొద్దు

కాగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పొంగల్ బరిలో జనవరి 10న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, 12 న బాలయ్య డాకు మహారాజ్,14న వెంకిమామ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఉండటంతో.. జనవరి 13 న 'రాబిన్ హుడ్' ను తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read :  'పుష్ప2' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Dil Raju: రేపు దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్.. ఆ సినిమా గురించేనా..?

నిర్మాత దిల్ రాజు రేపు భారీ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. అయితే వంశీ పైడిపల్లి, అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ప్రకటన ఉండబోతుందని టాక్.

author-image
By Archana
New Update
dil Raju big announcement

dil Raju big announcement

Dil Raju:  సౌత్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత దిల్ రాజు. రీసెంట్ గా  'గేమ్ ఛేంజర్' దెబ్బేసిన.. ఆ తర్వాత విడుదలైన  'సంక్రాంతికి వస్తున్నాం'  సినిమా గట్టెక్కించింది. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.  

దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్ 

ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ మరో అదిరిపోయే న్యూస్ చెప్పింది. రేపు దిల్ రాజు ఓ భారీ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే డైరెక్టర్ వంశీ పైడిపల్లి, అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ ప్రకటన ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 

cinema-news | latest-news | dil-raju ameerkhan 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

Advertisment
Advertisment
Advertisment