/rtv/media/media_files/2026/05/12/the-paradise-2026-05-12-20-41-22.jpg)
The Paradise
The Paradise: నాని(Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో కొన్ని సీన్స్ నానికి నచ్చలేదని, అందుకే మూవీకి రీషూట్ జరుగుతోందని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. అయితే తాజాగా ఈ ప్రచారాలపై మూవీ టీమ్ అధికారికంగా స్పందించింది.
‘ది పారడైస్’ నిర్మాతలు రీషూట్ వార్తలను పూర్తిగా తప్పుబట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఎలాంటి ఆటంకం లేకుండా ప్లాన్ ప్రకారమే సాగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన 100కి పైగా షూటింగ్ రోజులు విజయవంతంగా పూర్తయ్యాయని, మిగిలిన భాగాల చిత్రీకరణ కూడా షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని తెలిపారు.
సినిమాలో ఇప్పటివరకు ఒక్క రీషూట్ కూడా జరగలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి అవసరం ఉండదని మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. మొదట సినిమా ఎలా ప్లాన్ చేసారో అదే స్థాయిలో, అదే నమ్మకంతో ప్రతి సీన్ తెరకెక్కిస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు సూచించారు. అధికారికంగా విడుదల చేసే సమాచారం మాత్రమే నిజమని, ఎలాంటి నిర్ధారణ లేని వార్తలను ప్రచారం చేయకూడదని మీడియా సంస్థలను కూడా కోరారు. ఇకపై సినిమా గురించి తప్పుడు వార్తలు వస్తే వాటిపై నేరుగా స్పందిస్తామని నిర్మాతలు హెచ్చరించారు.
Over the past few days, we’ve noticed several baseless rumors and irresponsible speculations being circulated about #TheParadise.
— THE PARADISE (@TheParadiseOffl) May 12, 2026
For clarity:
• #TheParadise was planned with absolute clarity from day one, and the film is progressing exactly as intended. Over 100 shooting days… https://t.co/kjP8VpgV9x
ఇటీవల ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. అయితే మూవీ టీమ్ అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. మొదట మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను మంచి పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఆగస్టు 21కు మార్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మళ్లీ రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని, సినిమా ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతుందని నిర్మాతలు మరోసారి ధృవీకరించారు.
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న రెండో సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ వస్తాయని మూవీ టీమ్ తెలిపింది.
Follow Us