Court Trailer: హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'కోర్ట్'. ఓ యువకుడిని అన్యాయంగా కేసులో ఇరికించిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నటుడు ప్రియదర్శి ఆ యువకుడి కోసం కేసు వాదించే లాయర్ గా ప్రధాన పాత్ర పోషించారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి 14న థియేటర్స్ లో విడుదల కానుంది.
Also read : Mika Singh: అందుకే వాళ్లకు ఆ గతి పట్టింది.. బిపాసా దంపతులపై ప్రముఖ సింగర్ షాకింగ్ కామెంట్స్!
Truth will always find its way.
— Nani (@NameisNani) March 1, 2025
Nothing will or nothing can change that.
This film and this team will make you proud on March 14th.
Trailer on 7th.
#Court https://t.co/YA5lGfj6ZY pic.twitter.com/FIs8yzGPiE
'కోర్ట్' ట్రైలర్
ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత నాని మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మార్చి 7న ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. "సత్యం ఎల్లప్పుడూ తన దారిని కనుగొంటుంది. ఏదీ దానిని మార్చలేదు" అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు.
Also Read: Pellikani Prasad: హైప్ అదిరింది.. ప్రభాస్ తో 'పెళ్లికాని ప్రసాద్' టీజర్.. రిలీజ్ ఎప్పుడంటే
రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర్ అనింగి తదితరులు కీలక పాత్రలు పోషించారు. నానితో పాటు దీప్తి గంట సహనిర్మాతగా వ్యవహరించారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
Also read : Viral video: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!