Sharwa37 : శర్వానంద్ కోసం నందమూరి, కొణిదెల హీరోలు.. ఫ్యాన్స్ కు స్పెషల్ అనౌన్స్ మెంట్

శర్వానంద్ హీరోగా 'Sharwa37' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీకి సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. జనవరి 14 న నందమూరి, కొణిదెల హీరోల చేతుల మీదుగా  'Sharwa37' టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

New Update
sharwa 37 movie

sharwa 37 movie

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది ఈ హీరో నటించిన 'మనమే' ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అలా అని డిసప్పాయింట్ అవ్వకుండా శర్వానంద్ తన తదుపరి ప్రాజెక్ట్‌ కోసం సిద్ధమవుతున్నారు. 

Also Read : 'పుష్ప' చీటింగ్.. మూవీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్

'Sharwa37' అనే వర్కింగ్ టైటిల్ తో రీసెంట్ గానే అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ కు 'సామజవరగమన' మూవీ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్‌తో పాటు ఇద్దరు కథానాయికలు సందడి చేయనున్నారు. అందులో ఒకరు సంయుక్తా కాగా, మరొకరు 'ఏజెంట్' మూవీ ఫేమ్ సాక్షి వైద్య. 

కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి శర్వానంద్, సాక్షి వైద్యల ఫస్ట్ లుక్స్‌ను విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు చిత్రబృందం ఈ చిత్రానికి టైటిల్‌ అండ్  ఫస్ట్ లుక్‌ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి నందమూరి, కొణిదెల హీరోలు ముఖ్య అతిథులుగా రానున్నారు. 

Also Read : 'రాజాసాబ్' పై అంచనాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్.. థమన్ షాకింగ్ కామెంట్స్

ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. జనవరి 14 న నందమూరి, కొణిదెల హీరోల చేతుల మీదుగా  'Sharwa37' టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి 'నారీ నారీ నడుమ మురారి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇదే పేరుతో గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా చేశారు. ఇక 'Sharwa37' ప్రాజెక్ట్ ను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ సుంకర మరియు రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతం విభాగంలో విశాల్ చంద్రశేఖర్ పనిచేస్తుండగా, ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు