Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?

నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్ ప్రకటించడంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, వెంకటేష్ సహా మరికొందరు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేశారు.

New Update
Nandamuri Balakrishna Padma Bhushan

Nandamuri Balakrishna Padma Bhushan

నందమూరి బాలకృష్ణకు కేంద్రం తాజాగా పద్మ భూషణ్‌ను అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు, రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా మరికొందరు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. మరి ఎవరెవరు ఆయనకు కంగ్రాట్స్ తెలిపారో ఇప్పుడు చూసేద్దాం. 

ఏపీ సీఎం చంద్రబాబు

పద్మభూషణ్ అవార్డు పొందిన తెలుగు సినిమా దిగ్గజం, హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి హృదయపూర్వక అభినందనలు! దిగ్గజ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ, సినిమా, రాజకీయాలు, దాతృత్వ రంగాలలో రాణించారు. ప్రజా సంక్షేమానికి, ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీరు చేసిన అంకితభావం లెక్కలేనన్ని జీవితాలను తాకింది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. నిజమైన ఐకాన్, దయగల నాయకుడికి ఇది తగిన గౌరవం అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వెండితెరపై ఎన్నో లెక్కలేనన్ని విభిన్న పాత్రలు పోషించిన బాలయ్య.. హిందూపురం శాసన సభ్యుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అధ్యక్షుడిగా ఎన్నో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. 

మంత్రి నారా లోకేష్

బాలయ్య బాబుకు పద్మ భూషణ్ అవార్డుపై బాలకృష్ణ పెద్ద అల్లుడు, ఏపీ విద్య & ఐటీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య అన్‌స్టాపబుల్‌ అని అన్నారు. మావయ్యకు పద్మ భూషణ్ అవార్డు రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. 

జూ.ఎన్టీఆర్

ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాల బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి, మీ అవిశ్రాంత ప్రజా సేవలకు నిదర్శనంగా ఈ అవార్డు వచ్చింది అని ఎన్టీఆర్ అన్నారు.

కళ్యాణ్ రామ్

ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్న నా బాబాయి నందమూరి బాలకృష్ణకి హృదయపూర్వక అభినందనలు. ఈ గౌరవం మీరు సినిమా ప్రపంచానికి చేసిన అసాధారణ కృషికి, సమాజ సేవలో మీ అవిశ్రాంత కృషికి నిజమైన గుర్తింపు అని అన్నారు.

రాజమౌళి

పద్మ పురస్కారాలలో తెలుగు ప్రముఖులు ఏడుగురికి అవార్డులు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని డైరెక్టర్ రాజమౌళి ట్వీట్ చేశారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు అజిత్, శేఖర్ కపూర్‌తో పాటు మిగతా పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి 

పద్మ విభూషణ్ గ్రహీత డా. డి నాగేశ్వర్ రెడ్డి సహా పద్మ భూషణ్ వరించిన బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు శేఖర్ కపూర్, అనంత్ నాగ్, తన 'రుద్రవీణ' హీరోయిన్ శోభనకు కంగ్రాట్స్ చెప్పారు. అలాగే పద్మశ్రీ గ్రహీతలు మాడుగుల నాగఫణి శర్మ, అర్జిత్ సింగ్‌కు చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. 

హీరో వెంకటేష్

పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్న బాలయ్యకు వెంకటేష్ అభినందనలు తెలిపారు. సినిమాపై ఆయన చూపించిన ప్రభావానికి, ప్రజా సేవ పట్ల ఆయనకున్న అంకిత భావానికి ఇదే తగిన గౌరవం అని తెలిపారు. 

హీరో మహేశ్ బాబు 

పద్మభూషణ్‌ అవార్డుతో కేంద్రం సత్కరించిన బాలకృష్ణకి అభినందనలు అని మహేశ్ బాబు అన్నారు. సినిమా, కళల పట్ల ఆయనకున్న ప్రేమ, అంకితభావానికి ఈ అవార్డు అందుకునేందుకు పూర్తిగా అర్హత ఉన్న వ్యక్తి బాలయ్య అని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment