Nagababu : ప్రతి హీరో నాయకుడు కాలేడు.. పవన్ పై నాగబాబు సంచలన ట్వీట్

మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్నిచోట్లా బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సందర్భంగా నాగబాబు.. పవన్ తో పాటు ఛత్రపతి శివాజీ ఫోటో షేర్ చేస్తూ ప్రతి హీరో నాయకుడు కాలేడని, రాజకీయాల్లో పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అని పోస్ట్ పెట్టారు.

New Update
nagbabu

మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల జేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా  ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో జనాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవన్ కు ఇతర రాష్ట్రాల్లో నెక్స్ట్ లెవెల్ ఫాలోయింగ్ ఉందని అర్థమయింది. 

ఇక తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన అన్నిచోట్లా బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ప్రస్తుతం మహారాష్ట్రలో ఆయన పేరు మారు మోగుతోంది. ఈ సందర్భంగా ఇప్పటికే పవన్ ని మహారాష్ట్ర నాయకులతో పాటూ సినీ, రాజకీయ ప్రముఖులు అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ లిస్ట్ లో మెగా బ్రదర్ నాగబాబు సైతం చేరిపోయారు. 

Also Read : కమెడియన్ ఆలీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ

ప్రతి హీరో నాయకుడు కాలేడు..

తాజాగా నాగబాబు ఓ స్పెషల్ పోస్ట్ చేసారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఛత్రపతి శివాజీ ఉన్న ఫోటో షేర్ చేసిన ఆయన..' గెలిచే ప్రతి నాయకుడు హీరోనే, కాని ప్రతి హీరో నాయకుడు కాలేడు. నాయకుడంటే గెలిచే వాడే కాదు. నమ్మిన సిద్ధాంతాల కోసం సైధ్దాంతిక విలువల కోసం అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం నీడై నిలబడేవాడు, తోడై నడిపించేవాడు, వారి గమ్యంలో గెలుపుని చూసుకునే వాడు, వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునే వాడు, అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు. ప్రస్తుత భారత రాజకీయాల్లో పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్..' అంటూ రాసుకొచ్చారు. దీంతో నాగబాబు పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Also Read : వాళ్లకు AR రెహమాన్ టీమ్ లీగల్ నోటీసులు.. అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HariHaraVeeraMallu Release: వీరమల్లు విడుదల డౌటే..? పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మే 9న విడుదల కానుండగా.. ఇంకా షూటింగ్ పనులు పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. పవన్ ఆరోగ్యం, అలాగే కొడుకుకు ప్రమాదం జరగడం ఆలస్యానికి కారణమని టాక్.

New Update

HariHaraVeeraMallu Release:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన  'హరిహర వీరమల్లు' మళ్ళీ పోస్ట్ ఫోన్ కానున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ సినిమాకు ఇంకా థియేటర్ మోక్షం కలగడం లేదు. మే 9న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించగా.. షూటింగ్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో మళ్ళీ వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం పవన్ కు సంబంధించిన షూట్ పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన కుమారుడు అగ్ని ప్రమాదానికి గురవడం, పవన్ ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో  షెడ్యూల్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న టైంకి మూవీని  రిలీజ్ చేయగలమా? లేదా అనే  టెన్షన్ లో ఉన్నారు మేకర్స్. మరోవైపు  ఫ్యాన్స్ కూడా  తీవ్ర నిరాశ చెందుతున్నారు.  ఇప్పుడు రిలీజ్ కాకపోతే..? ఇకపై  'హరిహరవీరమల్లు' విడుదల డౌటే? అని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

ఇప్పటికే మూడు సార్లు

ఇప్పటికే ఈ చిత్రాన్ని మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేశారు.  మొదటగా 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా  2022 మార్చి 28కి పోస్ట్ ఫోన్ చేశారు. ఆ తర్వాత  2023, 2024లో పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో 2025 మార్చి 28కి రిలీజ్ వాయిదా వేశారు. అయితే అప్పటికి కూడా ఈ సినిమా చూసే భాగ్యం దక్కలేదు  ఫ్యాన్స్ కి. మళ్ళీ మే 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్. 

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై AM. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాసర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. 

cinema-news | latest-news | harihara-veeramallu-movie

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment