/rtv/media/media_files/2026/05/31/shobitha-2026-05-31-13-09-25.jpg)
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య, నటి శోభిత ధూళిపాళ్లకు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మే 31 (ఆదివారం) శోభిత బర్త్‌డే కావడంతో.. చైతన్య ఆమెతో కలిసి దిగిన కొన్ని అన్‌సీన్ బ్యూటిఫుల్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలతో పాటు ఆయన పెట్టిన లవ్లీ క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. "హ్యాపీ బర్త్‌డే మై లేడీ శోభిత.. నీతో కలిసి నా జీవితాన్ని పంచుకునే అవకాశం రావడం నా అదృష్టం. అందుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను" అంటూ హార్ట్ ఎమోజీని జోడించి చైతన్య తన ప్రేమను వ్యక్తపరిచారు. చైతన్య షేర్ చేసిన ఫోటోలలో శోభితకు సంబంధించిన కొన్ని క్యాండిడ్ పిక్స్‌తో పాటు, వారిద్దరూ కలిసి సరదాగా దిగిన సెల్ఫీలు కూడా ఉన్నాయి. ఒక ఫోటోలో శోభిత కొండ అంచున నిలబడి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కనిపించింది.
2017లో పెళ్లి
నాగచైతన్య, శోభితలు కొంతకాలం డేటింగ్‌లో ఉన్న తర్వాత.. 2024 ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో వీరిద్దరూ ఘనంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కాగా, శోభిత కంటే ముందు నాగచైతన్యకు నటి సమంతతో వివాహమైంది. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్ల తర్వాత అంటే 2021లో విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో వృషకర్మ అనే మైథికల్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రాజస్థాన్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ అందించగా, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సీజీఐ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Follow Us