Allu Arjun: నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఫ్యాన్స్, సెలెబ్రెటీలు, సినీ ప్రముఖులు అంతా బన్నీకి విషెష్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా అంతా అల్లు అర్జున్ బర్త్ డే విషెష్ తో మారుమోగుతోంది. ఈ క్రమంలో బన్నీ తన ఫ్యామిలీతో కలిసి కేక్ కట్ చేసిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోను అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహారెడ్డి షేర్ చేసింది. అలాగే భర్తకు విషెష్ ఒక స్పెషల్ రీల్ కూడా పోస్ట్ చేసింది. బన్నీ, పిల్లలతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలతో ఈ రీల్ క్రియేట్ చేశారు స్నేహ. ''నా ప్రేమకు 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది మీకు ఆనందం, శాంతి అన్నింటికంటే ఎక్కువ ఆరోగ్యం & శక్తితో నిండిన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. నిన్ను అనంతంగా ప్రేమిస్తున్నాను అని బర్త్ డే విషెస్ తెలిపారు.
Also Read: Sumanth Prabhas: ఈసారి గోదారి కుర్రాడిగా 'మేమ్ ఫేమస్' హీరో.. వైరలవుతున్న టైటిల్ పోస్టర్
అట్లీ - అల్లు అర్జున్
ఇదిలా ఉంటే బన్నీ బర్త్ డే సందర్భంగా అట్లీ - అల్లు అర్జున్ కాంబోలో మూవీని అనౌన్స్ చేస్తూ.. ఒక చిన్న వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోతో బన్నీ నెక్స్ట్ మూవీ హాలీవుడ్ రేంజ్ ని తలపించేలా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ఎక్కువగా వీఎఫ్ఎక్స్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఒక వీఎఫ్ఎక్స్ కంపెనీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అనంతరం అక్కడ బన్నీ లుక్‌ను టెస్ట్ చేశారు. యాక్షన్ సన్నివేశాల్లో బన్నీ లుక్ ఎలా ఉంటుందో చూపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
telugu-news | cinema-news | latest-news | allu-arjun | hbd-allu-arjun | allu-snehareddy
Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..