/rtv/media/media_files/2026/06/13/mouni-rai-2026-06-13-18-31-37.jpg)
ప్రముఖ నటి మౌనీ రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్ తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. తామిద్దరం పరస్పర అంగీకారంతో, ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తమ జీవితాల్లో ప్రాధాన్యతలు మారడం వల్లే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఒకరిపై ఒకరికి ఎప్పటికీ గౌరవం, అవగాహన ఉంటాయని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తమ మధ్య ఉన్న మంచి స్నేహాన్ని ఇలాగే కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామని ఆ ప్రకటనలో వివరించారు. ఈ క్రమంలో మౌనీ రాయ్ పై చాలా దారుణంగా కొందరు కామెంట్స్ చేశారు. ఆమెను గే అంటూ రూమర్స్ సృష్టించారు. అయితే దీనిపై ఆమె స్పందిస్తూ తాను విన్న వాటిలో అత్యంత అసంబద్ధమైన రూమర్ ఇదేనని మౌనీ రాయ్ వెల్లడించింది.
ఈ విడాకుల ప్రకటన తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, భారీగా భరణం డిమాండ్ చేశారని, అలాగే మూడో వ్యక్తి ప్రమేయం వల్లే ఈ బంధం ముక్కలైందంటూ సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. వీటిపై సూరజ్ నంబియార్ స్పందిస్తూ మరొక ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. తమ విడిపోవడం వెనుక ఎలాంటి గొడవలు లేవని, డబ్బు లేదా భరణానికి సంబంధించిన వివాదాలు అస్సలు లేవని స్పష్టం చేశారు. అలాగే తమ మధ్యలోకి మూడో వ్యక్తి రావడం వల్లే విడిపోతున్నామనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతూ వస్తున్న పుకార్లన్నింటినీ ఆయన పూర్తిగా కొట్టిపారేశారు.
ఆసక్తికరమైన వ్యాఖ్యలు
మరోవైపు ఇదే సమయంలో మౌనీ రాయ్ మహిళల స్వయంప్రతిపత్తి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతి యువతి జీవితంలో స్వతంత్రంగా ఉండటం చాలా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళలు మానసికంగా, ఆర్థికంగా ఎదగడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. అలా సొంత కాళ్లపై నిలబడినప్పుడే జీవితంలో వచ్చే ఎలాంటి హెచ్చుతగ్గులనైనా, కష్టనష్టలనైనా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలరని మౌనీ రాయ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కష్ట సమయాల్లో తనకు సహాయపడినందుకు ఆమె తన కుటుంబానికి, సన్నిహితులకు, ముఖ్యంగా తన స్నేహితురాళ్లకు కృతజ్ఞతలు తెలిపింది.
కాగా నాలుగేళ్ల డేటింగ్ తర్వాత 2022లో సూరజ్‌ను వివాహం చేసుకున్నారు. ఇటీవలే 2026లో అతనితో విడిపోయారు. ఇక సినిమాల విషయానికొస్తే హై జవానీ తో ఇష్క్ హోనా హై (2026) చిత్రంలో కనిపించారు.
Follow Us