/rtv/media/media_files/2025/02/25/K26rTD9GgfPZn4WHff8Y.jpg)
fight obesity mankibaat
Mohanlal: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో దేశంలో ఒబెసిటీ సమస్యను అధికమించేందుకు పిలుపునిచ్చారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పది మంది ప్రముఖులను నామినేట్ చేశారు. అందులో స్టార్ హీరో మోహన్ లాల్ పేరు కూడా ఉంది. అయితే నటుడు మోహన్ లాల్ దీని పై స్పందిస్తూ.. తనను నామినేట్ చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
మరో పది మందిని
హెల్తీ ఇండియాను నిర్మిద్దాం అంటూ తాను కూడా మరో పది మంది సినీ ప్రముఖులను నామినేట్ చేశారు. ''ఒబేసిటీపై పోరాట ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు. నూనె వాడకాన్ని తగ్గించడం వల్ల మార్పు రావచ్చు. ఈ మిషన్ లో చేతులు కలిపేందుకు నేను కూడా పది మందిని నామినేట్ చేస్తున్నాను. కలసికట్టుగా ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం'' అంటూ మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి, టోవినో థామస్, ఉన్నిముకుందన్, మంజూవారియర్, కళ్యాణి ప్రియదర్శని తదితరులను నామినేట్ చేశారు.
Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా
Thank you, Hon. PM @narendramodi Ji, for spearheading this vital movement to #FightObesity and for the nomination. A healthier India begins with mindful choices, and reducing excess edible oil consumption is a meaningful step in the right direction.
— Mohanlal (@Mohanlal) February 24, 2025
I am honored to pass this on… https://t.co/7TmhzdcoQq
మంకీబాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. 2022 ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కుంటున్నారని. ఇది చాలా ఆందోళకరమైన విషయమని అన్నారు. దీనిని అధిగమించేందుకు మనమంతా కృషి చేయాలి. తినే ఆహారంలో వంటనూనె వాడకాన్ని కనీసం పది శాతం వరకు తగ్గించాలి అంటూ #fight obesity ki పిలుపునిచ్చారు.