Peddi Update: మున్నాభాయ్ వాయిస్ మళ్లీ రిపీట్.. ఫ్యాన్స్ కోరిందే జరిగింది!

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై భారీ హైప్ నెలకొంది. దివ్యేందు శర్మ పాత్రకు ‘మిర్జాపూర్’లో వాయిస్ ఇచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ బాలూనే ఈ సినిమాలో కూడా డబ్బింగ్ చెప్పడం అభిమానులకు ఆనందం కలిగిస్తోంది. రేపు విడుదల కానున్న ట్రైలర్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

New Update
Peddi Update

Peddi Update

Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ ‘Peddi’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. గ్రామీణ క్రీడల నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సాన Buchi Babu Sana దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ Janhvi Kapoor నటిస్తోంది.

ఈ సినిమాలో ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు శర్మ Divyenndu Sharma కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆయన ‘రామ్ బుజ్జి’ అనే పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే తెలుగు వెర్షన్‌లో ఆయనకు ఎవరు డబ్బింగ్ చెబుతారన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇప్పుడు ఆ సందేహానికి సమాధానం లభించింది. ‘మిర్జాపూర్’ తెలుగు వెర్షన్‌లో మున్నా భాయ్ పాత్రకు వాయిస్ ఇచ్చిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ బాలూనే, ‘Peddi’ సినిమాలో కూడా దివ్యేందుకు డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అదే ఫేమస్ వాయిస్ మళ్లీ వినిపించనుండటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. సినిమాపై రోజురోజుకూ హైప్ పెరుగుతోంది. ఇక ఈ మూవీ ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు సమాచారం. Vriddhi Cinemas నిర్మిస్తున్న ఈ సినిమాకు A. R. Rahman సంగీతం అందిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు