కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు: కొండా సురేఖ తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంతపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ తెలిపారు. ఎవరి మీద తనకు ద్వేషం లేదని, మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కానీ కేటీఆర్ విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదని, అతను క్షమాపణ చెప్పాల్సిందేనని సురేఖ బల్ల గుద్దినట్లు తెలిపారు. By Kusuma 03 Oct 2024 in సినిమా తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత, నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ నాయకులు నుంచి విమర్శలు రావడంతో ఆమె సమంతకు సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కూడా తెలిపారు. సమంత మనోభావాలను దెబ్బ తీయడం నా ఉద్దేశం కాదు.. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇది కూడా చూడండి: నాగార్జున ఫ్యామిలీని రోడ్డుపైకి లాగడానికి కారణం అదే.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్! క్షమాపణ చెప్పాల్సిందే.. కేటీఆర్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని కొండా సురేఖ బల్ల గుద్దినట్లు చెప్పారు. ఎవరి మీద కూడా నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. ఏ విషయంలో నేను బాధపడ్డానో.. వేరేవారిని నొప్పించాను. ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నాను. నేను బాధపడిన పర్లేదు. కానీ ఇతరులు బాధపడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేటీఆర్ విషయంలో అసలు తగ్గేది లేదు. అతను క్షమాపణ చెప్పాల్సిందేనని కొండా సురేఖ తెలిపారు. ఇది కూడా చూడండి: Chiranjeevi: కొండా సురేఖ వ్యాఖ్యలు బాధపెట్టాయి: చిరంజీవి! కేటీఆర్ మినిస్టర్‌గా ఉన్న టైంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని కొండా సురేఖ ఆరోపించారు. కేటీఆర్ కు తల్లి అక్కా, చెల్లి లేరా? అంటూ ఫైర్ అయ్యారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని తన టీమ్ కు చెప్పారని సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మంత్రి సీతక్కపై కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా పోస్టులు పెట్టిందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు బీసీ మహిళ అయిన తనను కించపరుస్తూ పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆర్ కారణం అని సంచలన ఆరోపణలు చేశారు. ఇంకా కొందరు హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవటానికి కూడా కేటీఆరే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. #minister-konda-surekha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి