/rtv/media/media_files/2026/04/26/mehareen-2026-04-26-21-31-34.jpg)
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై గోప్యత పాటించిన ఈ ముద్దుగుమ్మ, ఏప్రిల్ 26న అర్ష్ ఔలఖ్‌ను వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన పెళ్లి ఫోటోలు చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ఫోటోలలో మెహ్రీన్ లేత గులాబీ రంగు వెడ్డింగ్ లెహంగాలో, భారీ సంప్రదాయ ఆభరణాలు ధరించి అత్యంత అందంగా కనిపిస్తుండగా, వరుడు అర్ష్ ఔలఖ్ కూడా అదే రంగు షేర్వాణీలో మెరిసిపోతున్నారు. వీరిద్దరూ ఒకరికొకరు ఎంతో దగ్గరగా, చిరునవ్వుతో ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Photos: #MehreenPirzada and #ArshAulakh Get Marriedhttps://t.co/bGB8qdYneJ#123telugu#ArshDiMehrpic.twitter.com/1LT3YhA2rw
— 123telugu (@123telugu) April 26, 2026
ప్రత్యేక ఫ్యాన్ బేస్
తెలుగులో 'ఎఫ్2', 'రాజా ది గ్రేట్' వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మెహ్రీన్, తమిళంతో పాటు బాలీవుడ్‌లో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ, తన జీవిత భాగస్వామిగా అర్ష్ ఔలఖ్‌ను ఎంచుకుని పెళ్లిపీటలు ఎక్కడం అందరినీ ఆకర్షిస్తోంది. ఏప్రిల్ 26వ తేదీని తన పోస్ట్‌లో మెన్షన్ చేస్తూ ఆమె పెట్టిన ఈ వెడ్డింగ్ ఫోటోలపై సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిశ్చితార్థం రద్దు చేసుకుని మానసిక సంఘర్షణ ఎదుర్కొన్న మెహ్రీన్, ఇప్పుడు అర్ష్‌తో కలిసి వైవాహిక జీవితాన్ని సుఖంగా గడపాలని అందరూ ఆశీర్వదిస్తున్నారు.
Follow Us