Raj Tarun-Lavanya Case: ఓవైపు రాజ్ ని ప్రేమిస్తూనే మస్తాన్ సాయితో బెడ్ రూమ్ లో.. లావణ్య గురించి ఫ్రెండ్ ప్రీతీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లావణ్య- మస్తాన్ సాయి కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది. తాజాగా లావణ్య మోసాలకు బలైన ఆమె ఫ్రెండ్ ప్రీతీ సంచలన విషయాలు బయటపెట్టింది. లావణ్య తనతో పాటు చాలామందికి డ్రగ్స్ అలవాటు చేసి జీవితం నాశనం చేసిందని ఆరోపణ చేసింది.

New Update
Lavanya friend Preethi

Lavanya friend Preethi

Raj Tarun-Lavanya Case: గతేడాది హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ కేసు పెట్టిన లావణ్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. కొన్నిరోజుల క్రితం రాజ్ తరుణ్ VS లావణ్యగా మొదలైన ఈ స్టోరీలో రకరకాల పాత్రలు, విషయాలు బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లు రాజ్ మోసం చేశాడంటూ ఆరోపణలు చేసిన లావణ్య.. ఇటీవలే మరో బాంబ్ పేల్చింది. మస్తాన్ సాయి అనే వ్యక్తి వద్ద అందులో దాదాపు 300 ప్రైవేట్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ఉందని పోలీసులను ఆశ్రయించింది. ఎట్టకేలకు హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందించి.. మస్తాన్ సాయిని అరెస్టు చేయించింది. 

Also Read:  మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!

నా జీవితం నాశనం..  

ఇది ఇలా ఉంటే.. తాజాగా లావణ్య స్టోరీలో మరో కొత్త వ్యక్తి బయటకు వచ్చారు. లావణ్య తన జీవితం నాశనం చేసిందంటూ ఆమె ఫ్రెండ్ ప్రీతీ.. లావణ్య గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది.  లావణ్యనే తనకు డ్రగ్స్ అలవాటు చేసిందని.. తనకు మాత్రమే కాదు చాలా మందికి ఆమె డ్రగ్స్ అలవాటు చేసిందని సంచలన ఆరోపణలు చేసింది. లావణ్య కన్నేస్తే ఎవరైనా పడాల్సిందే. చాలా మంది ఫోన్లు లాక్కొని బ్లాక్ మెయిల్ చేసింది. అలాగే మస్తాన్ సాయి ఫోన్లోని వీడియోలను తన ఫోన్ లోకి ఎక్కించుకొని రెండేళ్లుగా మస్తాన్ సాయిని బ్లాక్ మెయిల్ చేసింది అని తెలిపింది. 

Also Read:  ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!

Also Read:  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!

మస్తాన్ సాయి తో బెడ్ రూమ్ లో 

ప్రీతీ ఇంకా మాట్లాడుతూ.. ఓ ప్రముఖ పబ్ లో అక్కడ పనిచేసే  చాలా మందితో లావణ్య ఎఫైర్స్ పెట్టుకొని.. వాళ్లలో వాళ్ళకే గొడవలు పెట్టింది. దీంతో ఆ క్లబ్ ఆమెను బ్యాన్ చేసింది.  ఓ వైపు రాజ్ తరుణ్ ని ప్రేమిస్తూనే.. మస్తాన్ సాయితో ఒకే బెడ్ రూమ్ లో ఉంది. మస్తాన్ కి 40 మందితో ఎఫైర్లు లేవు.  నేను మస్తాన్ సాయికి సపోర్ట్ చేస్తున్నాను.. లావణ్య ఒక బ్లాక్ మెయిలర్, శాడిస్ట్.  తన విషయాలు బయటపడకూడదని రోజుకో కథ అల్లుతోంది. అందుకే నిజం బయటపెట్టాలని ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చాను అంటూ లావణ్య గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 

Also Read: Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు