/rtv/media/media_files/2025/03/17/ZNxFtPoByNvKU4NAQcoW.jpg)
కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసు వ్యవహారంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తనను అరెస్టు నుంచి మినహాయించాలని కోరుతూ కోర్టులో ఆమె భర్త జతిన్ హుక్కేరి పిటిషన్ వేశారు. రన్యారావు, జతిన్‌లు గతేడాది నవంబరులో పెళ్లి చేసుకున్నారని, అయితే డిసెంబరు నుంచి ఇద్దరు విడిగా ఉంటున్నట్లుగా జతిన్ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. హుక్కేరి తరపు న్యాయవాది ప్రభులింగ్ నవదగి మినహాయింపు కోరుతూ, తన క్లయింట్ నవంబర్‌లో రావును వివాహం చేసుకున్నారని, కానీ డిసెంబర్ నుండి కొన్ని సమస్యల కారణంగా అనధికారికంగా విడిపోయారని పిటిషన్ లో పేర్కొన్నారు.
దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా
కాగా గత మంగళవారం కర్ణాటక హైకోర్టు తదుపరి విచారణ వరకు అతనిపై ఎటువంటి చర్య తీసుకోకూడదని ఆదేశించింది. మార్చి 3న దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా తరలిస్తుండగా రన్యారావు పట్టుబడింది. హుక్కేరి బెంగళూరుకు చెందిన ప్రసిద్ధ ఆర్కిటెక్ట్, మూడు నెలల క్రితం బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్‌లో జరిగిన వివాహ వేడుకలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. రన్య రావు గోల్డ్ స్మగ్లింగ్ గురించి పోలీసులకు ఆమె భర్త జతిన్ సమాచారం అందించినట్లు సమాచారం. రన్య తరచుగా విదేశాలకు వెళ్తూ వస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేదని చెబుతున్నారు.
రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డీజీపీ రామచంద్రరావు కూతురు అయిన రన్యాను మార్చి 7 నుంచి 11 వరకు డీఆర్ఐ కస్టడీకి అప్పగిస్తూ ఆర్థిక నేరాల న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తాను గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లు అంగీకరించిందని, ఈ వ్యవహారంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పాత్ర కూడా ఉన్నట్లు రన్యా బయటపెట్టినట్లు సమాచారం. ఇదంతా కూడా అతని కోసమే చేసినట్లు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. రన్యారావు 2024లోనే ఆమె 30 సార్లు దుబాయ్‌కు వెళ్లిందని, ఇటీవలే కేవలం 15 రోజుల్లో 4 సార్లు విదేశాలకు వెళ్లినట్లుగా గుర్తించారు. ప్రతి ట్రిప్‌లో కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు నిర్ధారించారు. స్మగ్లింగ్ చేసినందుకు ఒక ట్రిప్ కు రూ.12 లక్షలు తీసుకుంటుందని తెలిపారు.
Also Read : బూతులతో ట్రోల్స్.. ఏడేళ్లు నరకం చూశా.. శిల్పా చక్రవర్తి వీడియో వైరల్