లడ్డూ వివాదం, లిమిట్స్ లో ఉండండి.. ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు వార్నింగ్

తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్‌కు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సమాధానం ఇచ్చారు. దయచేసి ఇలాంటి విషయాల్లో ప్రకాశ్‌ సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికారు.

New Update
vishnu manchu

Tirupati Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని.. భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తిరుమల లడ్డూపై ఇప్పుడు నెలకొన్న వివాదం భక్తులను కలవరపెడుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేని, జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంది. జాతీయ స్థాయిలో దీనిపై రచ్చ జరుగుతోంది.ఈ క్రమంలోనే  సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 

ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోట్ చేస్తూ..' మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే మతాల మధ్య ఉన్న విభేదాలు చాలు' అని పోస్ట్ లో పేర్కొన్నారు. 

మీ పరిధుల్లో మీరు ఉండండి...

తాజాగా ప్రకాష్ రాజ్ పోస్ట్ పై మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తన ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.' ప్రకాశ్‌రాజ్‌. దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. కోట్లాది హిందువుల నమ్మకానికి గుర్తు. 

Also Read : నాని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారు. ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే, అసలు మతం ఏ రంగు పులుముకుంటోంది ఆలోచించండి. #మీ పరిధుల్లో మీరు ఉండండి' అని రిప్లై ఇచ్చారు.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Prabhas Spirit: బుర్రపాడు భయ్యా.. ప్రభాస్‌ ‘స్పిరిట్’లో ‘వైలెంట్ హీరో’ - రచ్చ రచ్చే!

ప్రభాస్ - సందీప్ రెడ్డివంగ కాంబో ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో మలయాళ స్టార్ ‘మార్కో’ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అతడు కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

New Update
unni mukundan key role in prabhas spirit

unni mukundan key role in prabhas spirit

రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. వీటి తర్వాత ప్రభాస్ లైనప్‌లో స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలు ఉన్నాయి. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

అయితే వీటిలో ముందుగా సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే ‘స్పిరిట్’ మూవీపైనే అందరి చూపులు ఉన్నాయి. యానిమల్ మూవీతో తన మార్క్ చూపించిన సందీప్‌ ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తీస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ ఆసక్తిక విషయాలు వెల్లడించి హైప్ పెంచేశాడు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

పోలీస్ పాత్రలో

ఇందులో ప్రభాస్ లుక్ చూస్తే అందరి మతులు పోతాయని తెలిపాడు. ఇప్పటి వరకు ఎవరూ చూపించని లుక్కులో డార్లింగ్‌ను చూపిస్తానని గత ఇంటర్వ్యూలలో చాలాసార్లు చెప్పాడు. దీంతో అందరూ ఇప్పుడు ఈ సినిమా కోసమే చూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో అంతా ఇప్పుడు ఈ చిత్రం కోసమే మాట్లాడుకుంటున్నారు. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

కీ రోల్‌లో స్టార్ హీరో

ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా మరొక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ‘మార్కో’ హీరో  ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అతడు కీ రోల్‌ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

spirit | Prabhas Spirit | prabhas | director-sandeep-reddy-vanga | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment