/rtv/media/media_files/2025/01/17/oDu4pEcHMzvEwNS5XG9s.jpg)
Manchu Vishnu
తాను ఏ నిర్ణయం తీసుకున్నా.. నాన్న మోహన్ బాబు ఆశీర్వంతోనే తీసుకుంటానని మంచు విష్ణు స్పష్టం చేశారు. మోహన్ బాబుకు తమ ముగ్గురి టాలెంట్ పై ఎలాంటి అపనమ్మకం లేదన్నారు. తండ్రిగా పిల్లలందరినీ ఒకేలా ప్రేమించాడన్నారు. జనరేటర్ లో చెక్కెర పోసి పేలేందుకు కట్ర చేశాడన్న మనోజ్ ఆరోపణలపై విష్ణు రియాక్ట్ అయ్యారు. ఇది సిల్లీ అని కొట్టిపారేశారు. జనరేటర్ లో చెక్కర పోస్తే ఫిల్టరింగ్ ప్రాసెస్ లోనే పోతుందన్నారు. పేలడం లాంటివి జరగదన్నారు. తమ ఇంటి గొడవ బయటకు రావడంపై ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరూ బాధపడ్డారన్నారు. మాట్లాడాల్సిన వారంతా మాట్లాడారన్నారు.
ఇది కూడా చదవండి: Manchu Brothers : మంచు బ్రదర్స్ మధ్య వార్.. 'తల నరికి నీ భార్య చేతిలో పెడతా' అంటూ మనోజ్ ఫైర్
గొడవలు అందరి ఇళ్లలోనూ ఉంటాయన్నారు. వివాదంతో మంచు ఫ్యామిలీ రెండు ముక్కలుగా విడిపోయిందన్న ప్రశ్నకు విష్ణు సమాధానం ఇవ్వలేదు. ఆస్తుల పంపకాలపై అడిగిన ప్రశ్నకు ఆయన ఇండైరెక్ట్ గా సమాధానం ఇచ్చారు. తమ తండ్రి తమందరినీ చదవించారన్నారు. పిల్లలు ఎవరైనా వాళ్ల కాళ్లపైనా నిలబడాలన్నారు. ఈ విషయంలో తమ అమ్మ నలిగిపోయినట్లు ఇంకా ఎవరూ నలిగిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిష్కారం లేని సమస్య అనేది ఉండదన్నారు. గాయం మానడానికి సమయం పడుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Manchu Vishnu: వీధిలో మొరిగే కుక్క.. మంచు మనోజ్ ను మళ్లీ గెలికిన విష్ణు!