Cinema: మాకూ గౌరవం అవసరం– మంచు విష్ణు, రాజమౌళి

నాగచైతన్య–సమంతల మీ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల మీద మొత్తం ఫిల్మ్‌ ఇండస్ట్రీ అంతా మండిపడుతోంది. అంత గౌరవం లేకుండా ఎలా మాట్లాడతారంటూ మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు, దర్శకధీరుడు రాజమౌళి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుందాతనాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు. 

author-image
By Manogna alamuru
New Update
sam

Manchu Vishnu And Rajamouli: 

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై తెలుగు సినిమా రంగంగ మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిన్నంతా అక్కినేని ఫ్యామిలీ వరుసగా ట్వీట్‌లు చేసి తమ కోపాన్ని తెలియజేశారు. నాగార్జున అయితే మరికొంచెం ముందుకు వెళ్ళి సురేఖ మీ పరువు నష్టం దావా కూడా వేశారు. ఆమె క్షమించమని అడిగినా కూడా తగ్గేదే ల్యా అన్నారు. ఈ రోజు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ నాగచైతన్య–సమంతలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.  షూటింగ్‌లు కూడా బంద్ చేసి మరీ తమ నిరసన వ్యక్తం చేసే ప్లాన్ లో ఉంది ఇండస్ట్రీ.  

దీనిపై తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఎవరినో విమర్శించడం కోసం మా సినిమా వాళ్ళను లాగడం చాలా బాధ కలిగించిందని మంచు విష్ణు అన్నారు. మా పరిశ్రమలో కూడా ఇతర రంగాలలనే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తోంది. కానీ..మమ్మల్ని ఇలా తక్కువ చేయడం అస్సలేమీ బాలేదు అంటూ విచారం వ్యక్తం చేశారు. మేం నటులుగా ప్రజలకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాం. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం అని ఆయన అన్నారు.  ఎవరూ తమ కుటుంబసభ్యులు టార్గెట్‌ అవడం లేదా వారి వ్యక్తిగత జీవితాలపై అబద్ధపు ఆరోపణలు రావడాన్ని  ఇష్టపడరు. అదేవిధంగా మేం కూడా మా కుటుంబాలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నామని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.  ఎవరికైనా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే..మీ ప్రయోజనాల కోసం మమ్మల్ని వాడుకోవద్దు అన్నారు మంచు విష్ణు. మా కుటుంబాలపై వచ్చే అబద్ధపు కథనాల వల్ల కలిగే బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. మా చిత్ర పరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూసినా నేను మౌనంగా ఉండను. ఇలాంటి దాడులను సహించం. మేమంతా ఏకమై నిలబడతామని విష్ణు చెప్పారు. 

మరోవైపు దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ ఇష్యూ మీద స్పందించారు. హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి అని అన్నారు రాజమౌళి.  నిరాధార ఆరోపణలు సహించలేనివి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధులు చేసినప్పుడు అస్సలు సహించం అని ట్వీట్ చేశారు. #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్‌ట్యాగ్‌ను పోస్ట్‌కు జోడించారు. 

Also Read: Telangana: స్వర్ణమయం కానున్న యాదాద్రి ఆలయ గోపురం

Advertisment
Advertisment
తాజా కథనాలు