మంచు మనోజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. నువ్వే నా బలం అంటూ

మంచు మనోజ్ తన తల్లికి హ్యాపీ బర్త్‌ డే చెబుతూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. అమ్మ నువ్వే నా బలం, నీకు శాంతి, ఆనందం, ప్రేమ తప్ప మరేమి ఇవ్వలేను అన్నారు. ప్రతి సందర్భంలోనూ నువ్వు నాకు అండగా నిలిచావు. నీకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పోస్ట్‌లో పేర్కొన్నారు.

New Update
manoj manchu

మంచు ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమన్న వేళ నటుడు మంచు మనోజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. తన తల్లికి హ్యాపీ బర్త్‌ డే చెబుతూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. అమ్మ నువ్వే నా బలం.. నేను నీకు శాంతి, ఆనందం, ప్రేమ తప్ప మరేమి ఇవ్వలేను అని అందులో పేర్కొన్నారు.

నువ్వు నాకు అండగా నిలిచావ్

ఇది కూడా చదవండి: 90 ఏళ్ల బామ్మకు డిగ్రీ పట్టా..యువతకు ఆదర్శంగా రాబర్ట్ జర్నీ

నువ్వే నన్ను ప్రతిరోజూ ఇన్‌స్పైర్ చేస్తావుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రతి సందర్భంలోనూ నువ్వు నాకు అండగా నిలిచావని తెలిపారు. నీకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పోస్ట్‌లో పేర్కొన్నారు.  పోస్ట్‌లో తన తల్లితో దిగిన ఫొటోలను మాత్రమే మంచు మనోజ్ షేర్ చేశారు. ఫొటోలో తండ్రి మోహన్‌బాబు, అన్న విష్ణు, అక్క లక్ష్మి లేని ఫొటోలను మనోజ్ షేర్ చేశారు. దీంతో మంచు ఫ్యామిలీలో రచ్చ ఇంకా కొనసాగుతోందనే చర్చ నడుస్తోంది. 

ఇది కూడా చదవండి: రేవంత్‌-అల్లు అర్జున్‌ పబ్లిసిటీ స్టంట్‌.. కేంద్రమంత్రి షాకింగ్‌ కామెంట్‌

మంచు మోహన్ బాబు ట్వీట్

మరోవైపు మంచు మోహన్ బాబు ఇవాళ సంచలన ట్వీట్ చేశారు. తాను పరారీలో ఉన్నానని వస్తున్న వార్తలపై స్పందించారు. ఇందులో భాగంగా తాను ఎక్కడికి పారిపోలేదని క్లారిటీ ఇచ్చారు. ముందస్తు బెయిల్ రద్దయ్యిందనే వార్తలు అవస్తవం అని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. తన ఇంట్లో మెడికల్ కేర్‌లో ఉన్నానని చెప్పారు. నిజాలు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. తప్పుడు వార్తలను నమ్మకండి అని ప్రజలను కోరారు. మోహన్ బాబు పరారీలో ఉన్నారంటూ నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు కోసం 5 ప్రత్యేక పోలీస్ బృందాల గాలింపు అని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మోహన్ బాబు ఆ వార్తలను ఖండించారు. 

ఇది కూడా చదవండి: బ్యాంక్ గోడకు కన్నం.. కనిపెట్టిన కాంట్రాక్టు ఉద్యోగి

కాగా గత రెండు రోజుల క్రితం వరకు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో అక్కడి వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన ఓ మీడియా జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేయడంతో మరింత సంచలనం అయింది. దీంతో జర్నలిస్టుపై దాడి జరిగిన నేపథ్యంలో మోహన్‌బాబుపై కేసు నమోదైంది. 

Also Read: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!

మోహన్ బాబు పై కేసు

జర్నలిస్టుపై దాడి జరిగినట్లు ఆధారాలు కూడా ఉండటంతో ఆయనకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మోహన్‌బాబుపై పహాడీషరీప్ పోలీసులు ముందుగా హత్యాయత్నం కేసు పెట్టారు. భారత న్యాయ సంహిత (BNS)లోని 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత న్యాయ నిపుణుల నుంచి సలహా తీసుకున్న తర్వాత తాజాగా 109 సెక్షన్ కింద కేసును మార్చారు 

#manchu-manoj #manchu mohan babu
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. ...

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment