/rtv/media/media_files/2026/04/16/tamannah-2026-04-16-15-00-38.jpg)
నటి తమన్నా భాటియాకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. పవర్ సోప్స్ లిమిటెడ్ సంస్థపై ఆమె దాఖలు చేసిన రూ.కోటి నష్టపరిహారం దావాను కోర్టు కొట్టివేసింది. తన ఫోటోలను అనుమతి లేకుండా వాడుకున్నారంటూ పవర్ సోప్స్ సంస్థపై నటి తమన్నా భాటియా చేసిన అప్పీల్‌ను మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఒప్పందం ముగిసిన తర్వాత కూడా సదరు సంస్థ తన ఫోటోలను వాడుకుందని, దీనివల్ల తనకు నష్టం జరిగిందని తమన్నా వాదించారు. అయితే, ఇందుకు తగిన ఆధారాలు లేవంటూ న్యాయమూర్తులు పి. వేల్మురుగన్, కె. గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
2008లో తమన్నా పవర్ సోప్స్ సంస్థతో ఒక ఏడాది పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం 2009 అక్టోబర్‌తో ముగిసింది. అయితే ఒప్పందం గడువు ముగిసినప్పటికీ అంటే 2010-2011 కాలంలో కంపెనీ తన ఫోటోలను సోప్ ప్యాకింగ్‌లపై, ప్రకటనల్లో, ఇంటర్నెట్‌లో వాడుకుందని తమన్నా ఆరోపించారు. దీనివల్ల వేరే బ్రాండ్లతో తాను చేసుకునే ఒప్పందాలకు నష్టం కలిగిందని పేర్కొంటూ రూ. కోటి నష్టపరిహారం కోరారు.
గతంలోనే ఒక సింగిల్ జడ్జి ఈ కేసును కొట్టివేయగా, తమన్నా దానిపై అప్పీల్‌కు వెళ్లారు. తాజాగా ఆ అప్పీల్‌ను విచారించిన హైకోర్టు.. తమన్నా సమర్పించిన సోప్ కవర్లు, కొనుగోలు పత్రాలు నమ్మదగ్గవిగా లేవని అభిప్రాయపడింది. కంపెనీ ఉద్దేశపూర్వకంగా ఆ ఫోటోలను వాడిందని నిరూపించే బలమైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ, గతంలో ఇచ్చిన తీర్పునే సమర్థించింది.
సిద్ధార్థ్ మల్హోత్రాతో సిరిఉనిమా
ఇదిలావుంటే తమన్నా చేతిలో ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఆగస్టు 28న విడుదల కానుంది. ఇది ఒక ఎమోషనల్ మసాలా ఫిలిం అని తమన్నా స్వయంగా పేర్కొన్నారు. సుందర్ సి దర్శకత్వంలో విశాల్ సరసన ఒక కొత్త సినిమాలో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమాలతో పాటు ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌పై కూడా ఆమె బిజీగా ఉన్నారు. తన కెరీర్ ముగిసిపోయింది అనుకున్న వారికి గట్టి సమాధానం ఇస్తూ బోల్డ్ పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా సాగిస్తున్నారు.
Follow Us