/rtv/media/media_files/2025/02/13/hh5VJW75GsrYrUP3E4pz.jpg)
Lavanya Apologies To Raj Tarun For Everything
‘‘హీరో రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను అన్ని విధాల వాడుకున్నాడు. అతడ్ని అస్సలు వదలను. నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాను. రాజ్ తరుణ్‌కి నాకు పెళ్లైంది. అతడు నా మెడలో తాళి కూడా కట్టాడు. కానీ ఇప్పుడు వేరే అమ్మాయి మోజులో పడి నన్ను వదిలించుకుంటున్నాడు’’ అంటూ గతంలో లావణ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
గతేడాది రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లావణ్య మరో వ్యక్తిపై ఆరోపణలు చేసింది. మస్తాన్ సాయి అనే వ్యక్తి వద్ద హార్డ్ డిస్క్ ఉందని అందులో దాదాపు 300 ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని హాట్ బాంబ్ పేల్చింది. ఎలాగోలా ఆ హార్డ్‌డిస్క్‌ను నార్సింగి పోలీసులకు అప్పగించి మస్తాన్ సాయిని అరెస్టు చేయించింది.
ఇది కూడా చదవండి: కేరళ నర్సింగ్ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్
కన్నీళ్లు పెట్టుకుంటూ
అయితే ఇంత చేసిన లావణ్య ఇప్పుడు రాజ్ తరుణ్‌కి సారీ చెప్పాలనుందని.. అతను పక్కనే ఉంటే కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్తానని అనడంతో అంతా షాకై షేకైపోతున్నారు. తాజాగా లావణ్య ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ వ్యాఖ్యలు చేసింది. తన మనిషి తనకు దూరమైపోతున్నాడనే బాధతోనే రాజ్ తరుణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది.
Lavanya Reveals Shocking Facts | మస్తాన్ సాయి నాపై మూడు స్లారు | Masthan Sai | Raj Tarun | RTV#rajtarun #masthanSai #lavanya #RTV pic.twitter.com/btD2sNEEoq
— RTV (@RTVnewsnetwork) February 13, 2025
ఇది కూడా చదవండి: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
సారీ చెప్పాలనుకుంటున్నా
తనను డ్రగ్స్ కేసులో రాజ్ తరుణే ఇరికించాడని మస్తాన్ సాయి చెప్పుడు మాటలు విని నమ్మేశానని పేర్కొంది. అందువల్ల ఈ విషయంలో రాజ్ తరుణ్‌కి సారీ చెప్పాలనుకుంటున్నానంది. అతడు ఇక్కడే ఉంటే మాత్రం కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడిగేదాన్నని.. ఏ ఆడదానికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కన్నీళ్లు పెట్టుకుంది. తనను చంపేస్తారనే భయం వేస్తుందనని.. తనకు ఏమైనా అయితే దానికి మస్తాన్ సాయి, వాళ్ల తల్లిదండ్రులే కారణం అని చెప్పుకొచ్చింది.