Kumbh Mela Monalisa : కుంభమేళా మోనాలిసాకు బాలీవుడ్ ఆఫర్

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోన్న మోనాలిసాకు భారీ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ చిత్రంలో అవకాశం కల్పిస్తానని బాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించారు.

author-image
By Madhukar Vydhyula
New Update
Kumbh Mela Monalisa Got Movie Offer

Kumbh Mela Monalisa Got Movie Offer

Kumbh Mela Monalisa Got Bollywood Movie Offer: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోన్న మోనాలిసా గురించి తెలిసిందే కదా.పిల్లి కళ్లు.. అమాయకపు చూపులు.. అంతకు మించి ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే మోనాలిసా తన అందంతో చూపరులను కట్టిపడేసింది. కుంభమేళాకు వెళ్లిన వారంతా ఆమెను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్‌గా మారాయి. వాటిని చూసిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమెకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అవసరమైతే యాక్టింగ్ నేర్పించి మరీ తన సినిమాలో పెట్టుకుంటానని చెప్పారు.  

Also Read:కారుపై ప్రతీకారం తీర్చుకున్న కుక్క.. వీడియో వైరల్

మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటున్న మోనాలిసా భోస్లే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన అమ్మాయి. వారి కుటుంబం పూసలు దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నది.  తన తమ్ముడిని చదివించేందుకు ఈ పని చేస్తున్నట్లు తెలిపింది. కొంతకాలం బాగానే చదువుకున్న ఆమె కుటుంబ ఆర్థిక సమస్యలు కారణంగా చదువుకు దూరమైనట్లు తెలిపింది. కాగా బాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను చూశాడు. పిల్లికళ్లు, ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ క్యూట్ బ్యూటీ అందానికి ఫిదా అయిన సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ.. దీనికి మీరెలా స్పందిస్తారంటూ నెటిజన్లను ప్రశ్నించారు. దీంతో ఈమె హీరోయిన్ మెటీరియల్ అని చెబుతూ.. ఛాన్స్ ఇవ్వాలని కోరారు.

Also Read: ఏపీ బీజేపీ చీఫ్ మార్పు.. పురంధేశ్వరి సంచలన కామెంట్స్!

  నెటిజన్లు ముద్దుగా ‘బ్రౌన్ బ్యూటీ’ అని  పిలుచుకుంటున్న మోనాలిసా భోస్లే సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ సెన్షేషన్‌గా మారింది. దీంతో కుంభమేళాకు వచ్చిన నెటిజన్లు, యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.  వ్యాపారం చేసుకోనివ్వకుండా  జనం సెల్ఫీల కోసం ఎగబడడం కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది. ఆమెను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మాత్రమే ఆమె విక్రయించే దండలు కొంటూ, ఎక్కువమంది ఆమెతో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన కొందరు నెటిజన్లు..  ''బ‌త‌కుదెరువు కోసం వస్తే.. ఇలా చేస్తారా? పేదింటి బిడ్డపై ఈ అరాచ‌కం ఏంటి?'' అంటూ కామెంట్లు పెడుతున్నారు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు