ప్రభాస్ ను కేవలం దానికే వాడుకుంటున్నారు.. కృష్ణవంశీ షాకింగ్ కామెంట్స్ డైరెక్టర్ కృష్ణవంశీ.. ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పని పట్ల ప్రభాస్ అంకిత భావంతో ఉంటాడు. మంచి పెర్ఫామర్. టాలీవుడ్ ఆయన్ను సరిగా వినియోగించుకోవడం లేదు. కేవలం ఫైట్లకే పరిమితం చేస్తున్నారని అన్నారు. By Anil Kumar 16 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ పై డైరెక్టర్ కృష్ణవంశీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తెరకెక్కించిన 'ఖడ్గం' మూవీ రీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడారు. ఈ మేరకు ఇంటర్వ్యూలో కృష్ణవంశీకి.. 'చక్రం' లాంటి సెన్సిటివ్ మూవీలో నటించేలా ప్రభాస్ ను ఎలా ఒప్పించారు? అనే ప్రశ్న ఎదురైంది. Also Read : నాకు యాక్టింగ్ రాదు, నేనొక చెత్త నటిని.. సమంత షాకింగ్ కామెంట్స్ దీనికి ఆయన బదులిస్తూ.." పని పట్ల ప్రభాస్ అంకిత భావంతో ఉంటాడు. మంచి పెర్ఫామర్. టాలీవుడ్ ఆయన్ను సరిగా వినియోగించుకోవడం లేదు. ఫైట్లకే పరిమితం చేస్తున్నారు. ‘చక్రం’తోపాటు అదే సమయంలో వేరే యాక్షన్ ఓరియెంటెడ్ స్టోరీ చెప్పా. ‘అందరూ యాక్షన్ కథలే చెబుతున్నారు సర్’ అంటూ ‘చక్రం’ కథ ఎంపిక చేసుకున్నారాయన. 20 ఏళ్ల తర్వాతా పరిస్థితి మారలేదు. Also Read : అఖండ ఖాతాలో అరుదైన రికార్డు.. అది బాలయ్యకే సాధ్యమంటున్న అభిమానులు! యాక్షన్ కే పరిమితం చేస్తున్నారు.. ఇప్పటికీ దర్శకులంతా ఆయన్ను యాక్షన్ కథలకే పరిమితం చేస్తున్నారు. గతంలో నేను చెప్పిన సబ్జెక్టుతో ఇప్పుడు సినిమా తీయొచ్చు. కానీ, ప్రభాస్ ఫుల్ బిజీ. నేనేమో అనుకున్న వెంటనే తెరకెక్కించాలనుకుంటా. ఇతర ప్రాజెక్టులు పక్కన పెట్టి నా సినిమా చేయండి అని చెప్పలేను కదా.." అని అన్నారు. Also Read : బోయపాటి, థమన్ లను కలిపిన బాలయ్య.. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా 'ఖడ్గం' సినిమా ఈ నెల 18న థియేటర్స్ లో రీ రిలీజ్ కాబోతుంది. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ సినిమా 2002లో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. Also Read : అల్లు అర్జున్ కోసం అభిమాని భారీ సాహసం.. ఏకంగా ఏం చేశాడంటే? #prabhas #director-krishna-vamshi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి