'దేవర' లో మీరు చూసింది 10 శాతమే.. అసలు కథ పార్ట్2 లోనే : కొరటాల శివ

కొరటాల శివ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘దేవర 2’ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పార్ట్‌-1 లో మీరు చూసింది 10 శాతమే. రెండో భాగంలో 100 శాతం చూస్తారు. కథలో అసలు మలుపు పార్ట్‌ 2లోనే ఉంది. ప్రతీ పాత్రలో ట్విస్ట్‌ ఉంటుంది. ఈ విషయంలో ప్రామిస్‌ చేస్తున్నానని అన్నారు.

New Update
devr2

మ్యాన్ ఆఫ్ మాసెస్  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కిన 'దేవర' మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 10 రోజుల్లోనే రూ.460 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సక్సెస్ ను అటు మూవీ టీమ్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 

కాగా 'దేవర' కు కొనసాగింపుగా పార్ట్-2 ఉంటుందని కొరటాల శివ అండ్ టీమ్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అలాగే 'దేవర' లో ఎన్నో ప్రశ్నలను వదిలేసి పార్ట్ 2 పైఅంచనాలు పెంచారు. తాజాగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దేవర 2’ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు." దేవర పార్ట్ 2లో జాన్వీ పాత్ర పవర్ ఫుల్ గా కూడా ఉంటుంది. జాన్వీ పాత్రని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. 

అసలు కథ పార్ట్-2 లోనే..

మొదటిభాగం కంటే రెండోభాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకులు సీట్‌ ఎడ్జికి వస్తారు. ఒక దర్శకుడిగా నేను పార్ట్‌ 2 విషయంలోనూ ఎంతో నమ్మకంగా, ఆసక్తిగా ఉన్నాను. కథలో అసలు మలుపు పార్ట్‌ 2లోనే ఉంది. ప్రతీ పాత్ర హైలో ఉంటుంది. ఎన్టీఆర్‌ అభిమానులందరికీ ఒక్కటే చెబుతున్నా.. పార్ట్‌-1 లో మీరు చూసింది 10 శాతమే.. రెండో భాగంలో 100 శాతం చూస్తారు.

ఇదే నా ప్రామిస్..

ప్రతీ పాత్రలో ట్విస్ట్‌ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు మీరు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. ఈ విషయంలో ప్రామిస్‌ చేస్తున్నాను. తారక్‌ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతడు తన పాత్రకు జీవం పోస్తాడు.." అంటూ చెప్పుకొచ్చాడు. కొరటాల కామెంట్స్ తో పార్ట్ - 2 అంచనాలు తారా స్థాయికి చేరాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Karthik Subbaraj అందుకే గేమ్ ఛేంజర్ డిజాస్టర్ .. అసలు మ్యాటర్ చెప్పిన కార్తిక్ సుబ్బారాజు

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు రామ్ చరణ్  'గేమ్ ఛేంజర్' పరాజయానికి గల కారణాన్ని బయటపెట్టారు. మొదట తాను శంకర్ కి ఒక డీసెంట్ IAS ఆఫీసర్ కథ చెప్పారట. కానీ ఆ తర్వాత కథను పూర్తి భిన్నంగా మార్చినట్లు తెలిపారు. కార్తీక్ గేమ్ ఛేంజర్ కి కథా రచయితగా చేశారు.

New Update

RRR తర్వాత భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్  'గేమ్ ఛేంజర్' సినిమా ఊహించని ఫలితాన్ని అందించింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ మూటకట్టుకుంది. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే మెగా అభిమానులతో సహా సినీ ప్రియులందరినీ తీవ్ర నిరాశపరిచింది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమా అవుట్ కమ్ పై కీలక విషయాలు వెల్లడించారు. అయితే కార్తీక్ సుబ్బరాజు గేమ్ ఛేంజర్ కి  కథా రచయితగా వ్యవహరించారు. 

అందుకే ప్లాప్

'రెట్రో'  ప్రమోషన్స్ లో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజు ఈ విషయం పై మాట్లాడారు. అయితే మొదట కార్తీక్ ఒక డీసెంట్ IAS ఆఫీసర్ కథను డైరెక్టర్ శంకర్ కు చెప్పారట. కానీ ఆ తర్వాత కథ పూర్తి భిన్నంగా మార్చబడింది. ఇందులో అనేక మంది రచయితలు పాల్గొన్నారు. కథ, స్క్రీన్ ప్లే మొత్తం మార్చబడ్డాయి అని వెల్లండించారు. ఇదిలా ఉంటే 'గేమ్ ఛేంజర్' విడుదలైన మరుసటి రోజు కార్తీక్ సుబ్బరాజు సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం. 

ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో 'పెద్ది' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ నుంచి టైటిల్ గ్లిమ్ప్స్ విడుదల చేయగా సోషల్ మీడియాను షేక్ చేసింది. చరణ్ మాస్ లుక్, డైలాగ్స్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందించాయి. దీంతో ఈసారి  గ్లోబల్ స్టార్ హిట్టు కొట్టడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. 

telugu-news | latest-news | cinema-news | game-changer | Ram Charan

Advertisment
Advertisment
Advertisment