'దేవర' పార్ట్-3 కూడా ఉందా? కొరటాల శివ ఏం చెప్పాడంటే?

కొరటాల శివ తాజాగా ఓ చిట్ చాట్ సెషన్ లో 'దేవర' పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చారు. 'దేవర' చిత్రాన్ని ప్రాంఛైజీగా మార్చాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఇందులో వచ్చే క్యారెక్టర్లు, కథనాలు నన్ను సెకండ్ పార్టు కూడా చేసేలా చేశాయని చెబుతూ పార్ట్- 3 లేదని కన్ఫర్మ్ చేశారు.

New Update
devra3

మ్యాన్ ఆఫ్ మాసెస్  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కిన 'దేవర' మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ మూవీ కేవలం 10 రోజుల్లోనే రూ.460 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సక్సెస్ ను అటు మూవీ టీమ్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 

కాగా 'దేవర' కు కొనసాగింపుగా పార్ట్-2 ఉంటుందని కొరటాల శివ అండ్ టీమ్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అలాగే 'దేవర' లో ఎన్నో ప్రశ్నలను వదిలేసి పార్ట్ 2 పైఅంచనాలు పెంచారు. ఇదిలా ఉంటే 'దేవర' మూవీ ప్రాంఛైజీగా రాబోతుందని, ఈ సినిమాకి పార్ట్ - 3 కూడా ఉండబోతుందని ఇప్పటికే నెట్టింట వార్తలు వినిపించాయి.దీనిపై డైరెక్టర్ కొరటాల శివ తాజా చిట్‌ చాట్‌లో క్లారిటీ ఇచ్చాడు.

ఎప్పుడూ అనుకోలేదు..

" దేవర చిత్రాన్ని ప్రాంఛైజీగా మార్చాలని నేనెప్పుడూ అనుకోలేదు. కథను ఒక సినిమాలో చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చా. దేవరలో వచ్చే కాంప్లెక్స్ క్యారెక్టర్లు, కథనాలు నన్ను సెకండ్ పార్టు కూడా చేసేలా చేశాయి. సీక్వెల్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించాం. మిగిలిన భాగాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం.." అని అన్నారు. 

Also Read : హమ్మయ్యా.. ఎట్టకేలకు పెళ్లి పీటలేక్కబోతున్న ప్రభాస్

పార్ట్-2 లోనే అసలు కథ..

 కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో ‘దేవర 2’ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 'దేవర' పార్ట్ 2లో జాన్వీ పాత్ర పవర్ ఫుల్ గా కూడా ఉంటుంది. జాన్వీ పాత్రని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. కథలో అసలు మలుపు పార్ట్‌ 2లోనే ఉంది. ప్రతీ పాత్ర హైలో ఉంటుంది. ఎన్టీఆర్‌ అభిమానులందరికీ ఒక్కటే చెబుతున్నా.. పార్ట్‌-1 లో మీరు చూసింది 10 శాతమే.. రెండో భాగంలో 100 శాతం చూస్తారని అన్నాడు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాక్ హీరోతో మూవీ.. హీరోయిన్‌పై మండిపడుతున్న నెటిజన్లు

పాక్ హీరో ఫవాద్ ఖాన్, వాణి కపూర్ నటించిన సినిమా ‘అబీర్ గులాల్’ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను బహిష్కరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు వారిపై మండిపడతున్నారు.

New Update

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ ఘటనపై ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌తో సంబంధాలు అన్నింటిని కూడా తెంచుకుంటుంది. ఆఖరికి పాకిస్థాన్ నటీనటులను  కూడా బ్యాన్ చేస్తున్నారు. ఆ దేశానికి చెందిన ఎవరూ కూడా ఇండియాకి చెందిన సినిమాల్లో నటించకూడదని అంటున్నారు.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా..

పాకిస్థాన్ హీరో ఫవాద్ ఖాన్, వాణి కపూర్ ఇద్దరూ కలిసి నటించిన సినిమా ‘అబీర్ గులాల్’. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. దీంతో ఈ సినిమాను బహిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమాను విడుదల చేసేది లేదని డిమాండ్ చేస్తున్నారు. అయితే మూవీ ప్రమోషన్స్ కోసం హీరోయిన్ ఓ పోస్ట్ కూడా చేసింది. దీంతో నెటిజన్లు మండిపడగా.. వెంటనే డిలీట్ కూడా చేసింది. 

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment