![return of the dragon](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/10/Zd5vUXfdCqLCq6XGQHPK.jpg)
return of the dragon trailer released
కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్‌కు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇప్పుడీ హీరో మరో కొత్త సినిమాతో వస్తున్నాడు.
Also Read: బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ డేవిల్ హంట్..1300 మంది అరెస్ట్!
‘డ్రాగన్’ అనే తీస్తున్నాడు. ఈ సినిమాకి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచానాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఫుల్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.
Also Read: డాంకీ రూట్ లో అమెరికా వెళ్తూ..పంజాబ్ యువకుడి మృతి!
ట్రైలర్ రిలీజ్
ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 2 నిమిషాలకి పైగా ఉన్న ఈ ట్రైలర్ సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ట్రైలర్‌లో హీరో హీరోయిన్ లవ్ అండ్ ఎమోషన్స్ చూపించి ఆసక్తి పెంచేశారు.
Also Read: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్ కంపెనీలు
ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా యూత్‌ని బాగా అట్రాక్ట్ చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో ప్రదీప్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా ఈ నెల అంటే ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.