Sri Tej: శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్స్ ఏమన్నారంటే?

కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండానే స్వయంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాడని తెలిపింది. తనంతట తాను ఫుడ్ కూడా తీసుకోగలుగుతున్నాడని వెల్లడించింది.

New Update
0

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కు కిమ్స్ హాస్పిటల్ తాజగా బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండానే స్వయంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాడని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. 

ఫీవర్ ఉంటుంది.. వైట్ బ్లడ్ సెల్స్.. మిగితా సెల్స్ అన్ని ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాయి. తనంతట తాను ఫుడ్ తీసుకోగలుగుతున్నాడు. నాడీ వ్యవస్థ పనితీరు ఇప్పటికీ అలాగే ఉందని కిమ్స్ వైద్యులు వెల్లడించారు.

'పుష్ప 2' ప్రీమియర్‌ షో చూసేందుకు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు