/rtv/media/media_files/2025/03/08/FIK5gFBsPM0ZvFkFTt3M.jpg)
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న #NKR21 నుంచి టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు అర్జున్ S/O వైజయంతి అనే టైటిల్ తో పాటుగా పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. టైటిల్ లో S/O అనే దాన్ని సంకెళ్లతో చూపిస్తూ వారి బాండింగ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఇందులో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ లుక్ లో కనిపిస్తుండగా.. కళ్యాణ్ రామ్ ఆమెకు కొడుుకుగా కనిపించనున్నారు.
Also read : గురుమూర్తి కేసులో బిగ్ ట్విస్ట్.. DNA టెస్టులో బయటపడిన సంచలనాలు!
Also read : ఏపీలో మరో కొత్త జిల్లా.. చంద్రబాబు కీలక ప్రకటన!
#NKR21 is '𝐀𝐑𝐉𝐔𝐍 𝐒/𝐎 𝐕𝐘𝐉𝐀𝐘𝐀𝐍𝐓𝐇𝐈'.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) March 8, 2025
Happy Women's Day to all the great women and mothers out there ✨
So glad to be working with @vijayashanthi_m Garu.
See you in cinemas soon. #ArjunSonOfVyjayanthi@saieemmanjrekar @SohailKhan @PradeepChalre10 @SunilBalusu1981… pic.twitter.com/EHq490qliO
25 ఏళ్ల తరువాత
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. కాగా 1990లో విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమాలో కూడా ఆమెది వైజయంతి పాత్ర కాగా.. మళ్లీ 25 ఏళ్ల తరువాత ఆమె అదే పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సోహైల్ ఖాన్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. తమ్మిరాజు ఎడిటర్. స్క్రీన్‌ప్లేను శ్రీకాంత్ విస్సా రాశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
Also Read : మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!
Also read : పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!