/rtv/media/media_files/9MqhRgL2OQiTwVg9tX5o.jpg)
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కిన 'దేవర' మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ.360 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి.. వీకెండ్ పూర్తవ్వకముందే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. దీంతో మూవీ టీమ్ ఇటీవల సక్సెస్ మీట్ సైతం నిర్వహించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఎన్టీఆర్ అమెరికా లాస్ ఎంజెలిస్ వెళ్లగా.. అక్కడి మీడియా సమావేశంలో తన కొడుకుల గురించి, వారి భవిష్యత్ గురించి తారక్ మాట్లాడారు. ముఖ్యంగా వాళ్ళ సినిమా ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు." ‘అభయ్, భార్గవ్ ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. వయసు పరంగా వాళ్లు చాలా చిన్నపిల్లలు. ప్రస్తుతం చదువుకుంటున్నారు.
Jr NTR, father to 10-year-old Abhay and 6-year-old Bhargav, recently opened up about his approach to parenting, particularly regarding his children's potential future in acting.
— IndiaToday (@IndiaToday) October 6, 2024
Read more: https://t.co/s9BjRr8VKE#Tollywood #JrNTR #acting #children | @Showbiz_IT pic.twitter.com/Et6oq8LS24
Also Read : 'మహారాజ' 100 డేస్ సెలెబ్రేషన్స్.. డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్
వాళ్ళను బలవంత పెట్టను..
భవిష్యత్‌లో కూడా వాళ్లను 'సినిమాల్లోకి రండి.. యాక్టింగ్ నేర్చుకోండి..' అని బలవంతపెట్టను. నాకు ప్రేరణ నా తల్లిదండ్రులే. వాళ్లెప్పుడు నన్ను ఆ విధంగా ట్రీట్ చేయలేదు. ‘వాడేదో సాధించాలనుకుంటున్నాడు.. చేయనీ..’ అని నా మానన నన్ను వదిలేశారు.
నేనూ నా పిల్లల విషయంలో అలాగే ఉంటా. అయితే.. నా వృత్తి గురించి నా పిల్లలకు తెలుసు. నన్ను వాళ్లు నటుడిగా చూస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ల నాన్నలాగే వాళ్లూ హీరోలం కావాలని కోరుకుంటారు. అది ఎలాగూ జరుగుతుంది.." అని చెప్పుకొచ్చారు. దీంతో తారక్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.