JD Chakravarthy: విష్ణుప్రియతో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి.

జేడీ చక్రవర్తి, విష్ణుప్రియ మధ్య సంబంధం ఉందన్న రూమర్లపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆమె తన విద్యార్థి మాత్రమేనని, ప్రేమ లేదా పెళ్లి వంటి వార్తలు పూర్తిగా తప్పని చెప్పారు. వీరిద్దరూ కలిసి కనిపించడం వల్ల వచ్చిన గాసిప్స్‌ను ఆయన ఖండించారు.

New Update
JD Chakravarthy

JD Chakravarthy

JD Chakravarthy: ఇటీవల సోషల్ మీడియాలో నటుడు జేడీ చక్రవర్తి, నటి విష్ణుప్రియ(Vishnu Priya) గురించి పలు రూమర్లు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ తరచుగా కలిసి కనిపించడం వల్ల వీరి మధ్య ఏదో సంబంధం ఉందని చాలామంది అనుమానించారు.

విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం, ఆమెపై ఇప్పటికే వచ్చిన గాసిప్స్ కూడా ఈ వార్తలకు మరింత బలం ఇచ్చాయి. జేడీ చక్రవర్తి కూడా వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా ఉండటం వల్ల ఈ రూమర్లు ఎక్కువయ్యాయి.

ఈ విషయంపై తాజాగా జేడీ చక్రవర్తి స్పందించారు. తన కొత్త సినిమా ప్రచారం సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. విష్ణుప్రియతో తనకు ఎలాంటి ప్రేమ సంబంధం లేదని స్పష్టం చేశారు.

తనకు నటనతో పాటు తత్వశాస్త్రంపై ఆసక్తి ఉందని, ఆ విషయాల్లో విష్ణుప్రియ తన దగ్గర నేర్చుకుంటుందని చెప్పారు. ఆమెను తాను ఒక విద్యార్థిగా మాత్రమే చూస్తానని, పెళ్లి గురించి వస్తున్న వార్తలు పూర్తిగా తప్పని అన్నారు.

దీంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై వచ్చిన గాసిప్స్‌కు పూర్తి క్లారిటీ వచ్చింది.

Advertisment
తాజా కథనాలు