/rtv/media/media_files/2026/06/08/jayabacchan-2026-06-08-18-08-20.jpg)
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నప్పటికీ, అందులో హీరోయిన్ పాత్రను చూపించిన విధానంపై వివాదం మాత్రం ముదురుతోంది. సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రకు విపరీతంగా గ్లామర్ డోస్ పెంచడం, ఆమె నడుము, ఎద అందాలపైనే కెమెరా పదే పదే ఫోకస్ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి, ఎంపీ జయా బచ్చన్, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ఘాటుగా స్పందించారు.
సినిమాలో మహిళలను కేవలం ఒక గ్లామర్ వస్తువులా చూపించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటివి జరిగినప్పుడు నటీమణులు షూటింగ్ సెట్‌లోనే గట్టిగా నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్‌లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. నాతో హద్దులు దాటి ప్రవర్తించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. కానీ నా కెరీర్‌లో ఒకే ఒక్కసారి ఒక దర్శకుడు నన్ను గ్లామరస్‌గా, కాస్త శృంగారభరితంగా చూపించడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత నేను అతనితో ఎప్పుడూ పని చేయలేదని చెప్పారు. మనోజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన షోర్ సినిమాలో జయా బచ్చన్ ఒక వీధి గుండాల అమ్మాయిగా నటించారు. ఆ పాత్ర కోసం సినిమా మొత్తం కేవలం ఘాగ్రా-చోలీ మాత్రమే వేసుకోవాలని దర్శకుడు పట్టుబట్టగా.. ఆమె మాత్రం పైభాగాన్ని కవర్ చేస్తూ కచ్చితంగా దుపట్టా వేసుకుంటానని గట్టిగా గొడవపడ్డారు.
ఈ వివాదంలోకి ఎంటర్ అయిన కరీనా కపూర్ ఖాన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెరపై శృంగార భావాలు పండించడానికి చిన్న చిన్న బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
బుచ్చిబాబు సానా క్షమాపణలు
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రేక్షకులను నొప్పించిన ఆ సన్నివేశాల పట్ల ఆయన క్షమాపణలు చెప్పారు. విమర్శలు వచ్చిన ఆ అభ్యంతరకర సీన్స్ అన్నింటినీ సినిమా నుంచి వెంటనే తొలగిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో సినిమాలు తీసేటప్పుడు ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉంటానని బుచ్చిబాబు హామీ ఇచ్చారు.
Follow Us