Jani Master: జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల.. అలా చేస్తే బెయిల్ రద్దు

చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల అయ్యారు. పలు షరతులతో జానీ మాస్టర్‌కి నిన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్ పనిచేసే ప్లేస్‌కు వెళ్లి.. ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు చెప్పింది.

New Update
jani master,

చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల అయ్యారు. పలు షరతులతో జానీ మాస్టర్‌కి నిన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్ పనిచేసే ప్లేస్‌కు వెళ్లి.. ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు చెప్పింది.

ఇది కూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే కూల్చు.. రేవంత్ కు కిషన్ రెడ్డి సంచలన సవాల్!

కాగా గత నెల 15న జానీపై లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. అవకాశాల పేరుతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడంటూ కంప్లైంట్ ఇచ్చింది. అతడితో పాటు జానీ మాస్టర్ భార్య పేరును కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీ గత నెల రోజులుగా చంచల్‌గూడ జైల్లోనే ఉన్నారు. 

ఏం జరిగింది..

ఇది కూడా చదవండి: చేసిందంతా కేసీఆరే.. కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు!

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ అతడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 2017లో తనను అత్యాచారం చేశాడని.. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!

అంతేకాకుండా షూటింగ్ కోసం వేరే ప్రాంతాలకు వెళితే అక్కడ కూడా తనపై లైంగిక దాడి చేసినట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం తన వయసు 21 ఏళ్లు అని చెప్పిన ఆమె.. తాను మైనర్‌గా ఉన్నపుడే తనపై దాడి చేశాడని పేర్కొంది. దీంతో పోలీసులు జానీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌లో ఉంచారు. 

నేషనల్ అవార్డు రద్దు

ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!

కోలీవుడ్‌లో ధనుష్ హీరోగా నటించిన తిరుచిత్రాంబలం చిత్రానికి బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీకి నేషనల్ అవార్డు లభించింది. అయితే ఈ అవార్డు అందుకోబోతున్న తరుణంలో జానీ మాస్టర్ జైల్లో ఉండటంతో బెయిల్‌కు అప్లై చేశారు. దాదాపు బెయిల్ మంజురు అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు అవార్డు ఇవ్వకుండా జాతీయ అవార్డుల కమిటీ ప్రతినిధులు అడ్డుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

pahalgam Terror Attack: ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలీవుడ్‌ జంట!

జమ్మూకశ్మీర్‌ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ దాడి నుంచి నటి దీపికాకాకర్‌ తన భర్త షోయబ్‌త్రుటిలో తప్పించకున్నారు.ఈ విషయం గురించి వారు స్వయంగా వెల్లడించారు.

New Update
deeika

deeika

 


జమ్మూకశ్మీర్‌ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈదాడి నుంచి మరికొందరు వారి ప్రాణాలను అరచేతపట్టుకొని బయటపడ్డారు.నటి దీపికాకాకర్‌ తన భర్త షోయబ్‌ ఇటీవల కశ్మీర్‌ వెళల్లారు. విహార యాత్రకు సంబంధించిన ఫొటోలను ఆదివారం ఇన్‌ స్టాలో పంచుకున్నారు.

కశ్మీర్‌ లోని అందమైన ప్రదేశాలను వీడియోలు తీసి షేర్‌ చేశారు. దాడి జరిగిన తరువాత వీరి అభిమానులు ఆందోళన చెందారు. ఈ ఘటనలో వారు చిక్కుకుపోయారేమో అని మెసేజ్‌ లు పెట్టారు.తాజాగా దీపికా, ఆమె భర్త షోయబ్‌ ఢిల్లీ కి వచ్చేసినట్లు చెబుతూ ఓ పోస్టు పంచుకున్నారు. 

మేం క్షేమంగా ఉన్నాం.మంగళవారం ఉదయమే కశ్మీర్‌ నుంచి బయల్దేరాం. సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నాం.ఎవరూ ఆందోళన పడకండి అని ఇన్‌ స్టాలో తెలిపారు. తాము క్షేమంగా ఉన్నామని తెలుపుతూ దీపికా భర్త నటుడు షోయబ్ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. వారు ఢిల్లీ చేరుకున్నట్లు నటుడు తెలిపాడు.

ఈ పర్యటన పై వ్లాగ్‌ చేసినట్లు ప్రకటించారు.అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.ఒక వైపు పెనువిషాదం పై దేశమంతా బాధపడుతుంటే ఇప్పుడు వ్లాగ్‌ ప్రచారం చేసుకుంటున్నారా..? అంటూ కొందరు నెటిజన్ లు విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌ లో 27మంది మృతి చెందారు.  మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు.  సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం.  చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా.  పర్యాటకులనే టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి టూరిస్టులపై కాల్పులు జరిపారు.   వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

Also Read:BIG BREAKING : జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

Also Read: J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!

pahalgam army operation | Pahalgam attack | pahalgam breaking news | pahalgam latest news | bollywood | latest-news

Advertisment
Advertisment
Advertisment