Jacqueline Fernandez :  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం!

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె కొంతకాలంగా ముంబైలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

New Update
Jacqueline-Fernandez

Jacqueline-Fernandez

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె కొంతకాలంగా ముంబైలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిమ్స్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమెను జాక్వెలిన్ దగ్గరుండి చూసుకున్నారు. మార్చి 26న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో జాక్వెలిన్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కానీ తల్లి ఆనారోగ్యం వలన క్యాన్సిల్ చేసుకుంది.

ముంబైలో కిమ్ ఫెర్నాండెజ్ అంత్యక్రియలు

కాగా కిమ్ ఫెర్నాండెజ్ కు మొత్తం నలుగురు సంతానం. కాగా కిమ్ ఫెర్నాండెజ్ మృతి పట్ల జాక్వెలిన్ అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కిమ్ ఫెర్నాండెజ్ మలేషియా, కెనడియన్ సంతతికి చెందినది, అయితే ఆమె భర్త ఎల్రాయ్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందినవాడు. వీరిద్దరూ1980లలో కిమ్ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్నప్పుడు కలుసుకున్నారు. ఈ రోజు ముంబైలో కిమ్ ఫెర్నాండెజ్ అంత్యక్రియలు జరగనున్నాయి.  

Also Read :  TG News: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు