/rtv/media/media_files/0ysmXxjG2RTxY62BYMkt.jpg)
సినిమా ఇండస్ట్రీ లో మామూలుగానే సెంటిమెంట్స్ ఎక్కువ. ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తే ప్లాప్ పడుతుందని, ఆ హీరోతో చేస్తే నిర్మాతలకు మిగిలేది నష్టాలే అని.. ఇలా ఎన్నో సెంటిమెంట్స్ కొన్ని సార్లు నిజం అయ్యాయి. అందుకే ఒక్కోసారి సినీ స్టార్స్ సైతం సినిమా చేసేముందు ఈ సెంటిమెంట్స్ ను పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి సెంటిమెంట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సెంటిమెంట్ ను హైలైట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్లాప్స్ తో టాలీవుడ్ డైరెక్టర్స్ తో ఈ సెంటిమెంట్ ను లింక్ చేస్తున్నారు.
Also Read : 'ఓజీ' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి.. వైరల్ అవుతున్న థమన్ ట్వీట్
ఆ సెంటిమెంట్ ఏంటి?
జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల 'దేవర' సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తారక్ కు సోలో పాన్ ఇండియా హిట్ ను అందించింది. అలాగే 'ఆచార్య' డిజాస్టర్ తో ఫామ్ కోల్పోయిన కొరటాల శివకు నెక్స్ట్ లెవెల్ కం బ్యాక్ ఇచ్చింది. నిజానికి కొరటాల కంటే ముందు కూడా కొంతమంది డైరెక్టర్స్ ప్లాప్స్ తో ఉండి ఎన్టీఆర్ తో సినిమా చేసి హిట్ అందుకున్నారు. వాళ్లెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
1. పూరీ జగన్నాథ్ : డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన కెరీర్ లో వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న రోజుల్లో ఆయన తో ఎన్టీఆర్ 'టెంపర్' మూవీ చేశారు. సినిమాలో తారక్ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అదరగొట్టాడు. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. పూరీకి మంచి కం బ్యాక్ ఇచ్చింది.
2. సుకుమార్ : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 2014 లో మహేష్ బాబుతో 'వన్ నేనొక్కడినే' అంటూ సరికొత్త ప్రయోగం చేశాడు. అది కాస్త బెడిసి కొట్టింది. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ ను మూటగట్టుకుంది. ఆ తర్వాత సరిగ్గా రెండేళ్లకు అంటే 2016 లో ఎన్టీఆర్ తో 'నాన్నకు ప్రేమతో' అనే సినిమా చేశాడు. ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమాలో తారక్ ను సరికొత్త లుక్ లో చూపించి,తన స్క్రీన్ ప్లే తో ఫ్యాన్స్ తో పాటూ ఆడియన్స్ ను అలరించాడు. ఫలింతగా ఈ సినిమా సూపర్ సక్సెస్ సాదించింది.
3. బాబీ : 'పవర్' సినిమాతో రైటర్ నుంచి డైరెక్టర్ గా మారి.. ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో రెండో సినిమానే పవన్ కళ్యాణ్ తో చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఆయనతో 'సర్దార్ గబ్బర్ సింగ్' చేశాడు. ఈ మూవీ ఫ్యాన్స్ ను బాగా డిజప్పాయింట్ చేసింది. అనంతరం ఎన్టీఆర్ తో 'జై లవకుశ' మూవీని తెరకెక్కించి కం బ్యాక్ అందుకున్నాడు.
4. త్రివిక్రమ్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కెరీర్ లో ఏకైక డిజాస్టర్ గా మిగిలిపోయింది 'అజ్ఞాత వాసి' మూవీ. పవన్ కళ్యాణ్ కు జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్స్ అందించడంతో గురూజీని గుడ్డిగా నమ్మి ఆయనతో 'అజ్ఞాత వాసి' చేశాడు. ఈ మూవీ రిజల్ట్ గురించి తెలిసిందే. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ ఎన్నో విమర్శలొచ్చాయి. దాంతో గురూజీ రూటు మార్చి ఎన్టీఆర్ తో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో 'అరవింద సమేత' మూవీ చేశాడు. ఈ సినిమా త్రివిక్రమ్ కు భారీ కంబ్యాక్ ఇచ్చింది.
5. కొరటాల శివ : కొరటాల కెరీర్ లో కూడా 'ఆచార్య' ఏకైక డిజాస్టర్ సినిమా. దీని కంటే ముందు ఆయన తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ తో చేసిన 'ఆచార్య' మాత్రం దారుణంగా ప్లాప్ అయింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి 'దేవర' తెరకెక్కించాడు. ఈ సినిమా ఇటీవలే రిలీజై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
Also Read : 'దేవర' పార్ట్-2 అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆనందంలో ఫ్యాన్స్
అలా ప్లాప్ లో ఉన్న ప్రతీ డైరెక్టర్ తో సినిమా చేసి వాళ్లకు జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ ఇచ్చాడని, ఏ డైరెక్టర్ కు అయినా ప్లాప్ వస్తే వెంటనే నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో చేస్తే కచ్చితంగా వాళ్లకు హిట్ పడుతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెగ హైలైట్ చేస్టున్నారు.
Shruti Haasan: నన్ను ఎవరూ ఆనందపరచలేదు.. బ్రేకప్ లిస్ట్ పై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్!
స్టార్ నటి శృతిహాసన్ తన ప్రేమకథ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బ్రేకప్స్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యానని చెప్పింది. ‘ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్?’ అని అడుగుతుంటే బాధగా ఉంటుంది. కానీ నా దృష్టిలో బ్రేకప్ కేవలం నంబర్ మాత్రమే' అని చెప్పింది.
Shruti Haasan interesting comments about love storys
Shruti Haasan: స్టార్ నటి శృతిహాసన్ తన ప్రేమ, పెళ్లి గురించి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తన పేరెంట్స్ డివోర్స్ కారణంగా తాము ఎదుర్కొన్న అవమానాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా లవ్ స్టోరీస్, బ్రేకప్స్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యానని, తన జీవితంలోకి వచ్చిన వారెవరు ఆనందాన్ని ఇవ్వలేకపోయారని తెలిపింది.
ఎన్నో బాయ్‌ఫ్రెండ్?
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. ‘నా లైఫ్ లో అత్యంత బాధపడిన సందర్భం లేదు. నాకెంతో ఇష్టమైన వారిని కూడా బాధపెట్టాను. వారికి జీవితాంతం సారీ చెబుతూనే ఉంటా' అని చెప్పింది. ఇక ప్రతి ఒక్కరికి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుందని, తనకు కూడా చాలా బ్రేకప్ స్టోరీలున్నాయని చెప్పింది. అయితే బ్రేకప్ తర్వాత దాని గురించి ఆలోచించనని, ‘ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్?’ అంటూ అడుగుతుంటారని తెలిపింది. కానీ తన దృష్టిలో బ్రేకప్ కేవలం నంబర్ మాత్రమేనని చెప్పేసింది. కొన్నిసార్లు ఇతరుల మాటలు బాధపెడుతుంటాయని, తాను కూడా మనిషినేనని చెప్పింది.
ఇక ‘గబ్బర్‌సింగ్’ సినిమా తన కెరీర్ కు బూస్ట్ ఇచ్చిందని, అంతకుముందు తనను ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ చేశారని వాపోయింది. ఫెయిల్ అయిన సినిమాల్లో హీరోను కాకుండా కేవలం తనను మాత్రమే టార్గెట్ చేయడం బాధకరమని చెప్పింది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాతే నా కెరీర్ ఊపందుకుంది. అయినా నేను నాకు నచ్చిన సినిమాల్లోనే నటించాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది.
sruthihasan | love | breakup | telugu-news | today telugu news