ప్రస్తుతం మన ఇండియన్ సినిమాల రేంజ్ ప్రపంచ స్థాయికి చేరింది. అందులో తెలుగు సినిమా ప్రముఖ పాత్ర పోషించింది. 'బాహుబలి' నుంచి 'పుష్ప' వరకు ఇండియా వైడ్ ఏ రికార్డు చూసిన మన సినిమాలే. ఇక ఓపెనింగ్స్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు. డే 1 కలెక్షన్స్ లో మన సినిమాలు బాలీవుడ్ ను సైతం వెనక్కి నెట్టాయి. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల గురించి ఏ స్టోరీలో తెలుసుకుందాం.. 1. RRR : రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన 'RRR' హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న ఇండియన్ సినిమాల లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ తొలి రోజు రూ.223 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఓపెనింగ్స్ లో ఇప్పటి దాకా మరే సినిమా 'RRR' ని బీట్ చేయలేకపోయింది. నేడు రిలీజైన అల్లు అర్జున్ 'పుష్ప2' మాత్రం 'RRR' డే 1 రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని, ఈ సినిమాకు వరల్డ్ వైడ్ సుమారు రూ.235 కోట్ల కలెక్షన్స్ రావచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 2. బాహుబలి 2 : ఈ లిస్ట్ లో 'బాహుబలి 2' రూ.218 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రభాస్ - రాజమౌళి కాంబోలో వచ్చిన ఈ మూవీ ఫుల్ రన్ లో రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 3. కల్కి 2898AD : ఈ ఏడాది ప్రభాస్ నటించిన 'కల్కి' మూవీ రూ.191 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని ,మూడో స్థానంలో ఉంది. ఫుల్ రన్ లో ఈ సినిమా వెయ్యి కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 4. సలార్ : ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ డే రూ.178.7 కోట్లు కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ లో మాత్రం రూ.700 కోట్ల వరకు రాబట్టింది. 5. KGF 2 : కన్నడ హీరో యశ్ నటించిన 'KGF 2' రూ.165 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించి టాప్-5 లో చోటు దక్కించుకుంది. ఫుల్ రన్ లో మాత్రం రూ.1200 కోట్ల వరకు రాబట్టింది. అయితే వీటితో పాటూ బాలీవుడ్ మూవీస్ పఠాన్, జవాన్.. ఓపెనింగ్స్ తక్కువ రాబట్టినా.. ఫుల్ రన్ లో మాత్రం రూ.1000 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించి టాలీవుడ్ కి గట్టి పోటీ ఇచ్చాయి.