Ticket Hike: రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకూ మహారాజ్ సినిమాలు సంక్రాంతి కానుకగా థియేటర్స్ సందడి చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు టికెట్ రేట్ల హైక్, బెనిఫిట్ షోలకు అనుమతివ్వాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోరగా.. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. 14 రోజుల పాటు టికెట్ ధరల పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు. Also Read: Sneha Reddy: అరెస్ట్ తర్వాత బన్నీ భార్య తొలి పోస్ట్ వైరల్.. అందులో ఏముందంటే? టికెట్ ధరల పెంపు పై హైకోర్టు షాక్ అయితే ఈ రెండు సినిమాల టికెట్ ధరల పెంపు పై ఏపీ ప్రభుత్వం ఆదేశాలను సవాలు చేస్తూ ఓ పిటీషనర్ హైకోర్టులో పిల్ వేశారు. టికెట్ ధరలు పెంచడం నిబంధనలనకు విరుద్ధమని.. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే ఉపసంహరించుకోవాలని వాదనలు వాదించాడు. మరోవైపు చిత్ర బృందాల తరుపున కూడా వాదనలు వినిపించారు. వాదోపవాదనలు విన్న కోర్టు నేడు టికెట్ ధరల పై తీర్పును ఇచ్చింది. 14 రోజుల టికెట్ ధరల పెంపును 10 రోజులకే పరిమితం చేస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. Also Read : 'అన్ స్టాపబుల్' లో తారక్ ప్రస్తావన.. స్పందించిన నాగవంశీ సుమారు మూడేళ్ళ పాటు తెరకెక్కిన గేమ్ చేంజర్ కోసం నిర్మాత దిల్ రాజు ఏ సినిమాకు చేయనంత ఖర్చు చేశాడు. కేవలం పాటలు కోసమే రూ. 75 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇక పూర్తి సినిమాకు భారీగానే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. మరోవైపు డాకూ మహారాజ్ సినిమాకి కూడా బడ్జెట్ బాగానే అయినట్లు టాక్. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ ధరలు, బెనిఫిట్ షోలపై కోత పడడంతో రెండు చిత్రాల నిర్మాతలకు భారీ షాక్ తగిలినట్లైంది. Also Read: HBD Yash: నాడు జేబులో రూ.300.. ఇప్పుడు చేతినిండా సినిమాలు.. ఇది కదా యష్ రేంజ్!