/rtv/media/media_files/2025/03/21/Vs1vMawFNmUdOtIX1i7z.jpg)
Ananya Nagalla Reacts On Betting Promotions
Betting App Case: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ కలకలం రేపుతోంది. సెలబ్రెటీలు సైతం ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నారు. ఎన్నో కుటుంబాలను రోడ్డున్న పడేస్తున్న ఈ బెట్టింగ్ భూతాన్ని అరికట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు.ఈ బెట్టింగ్ మాయలో పడి ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలపై ఈ బెట్టింగ్ వ్యసనం తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాంటి ఈ బెట్టింగ్ యాప్ లను కొంతమంది సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం వల్ల నిజమని నమ్ముతూ ప్రజలు మోసపోతున్నారు.
Also Read: రీ-రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన 'సలార్'.. అరాచకం సామి ఇదీ!!
ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు చాలా ఏళ్లగా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ బాధితులు రోజు రోజుకి పెరిగిపోతుండటంతో సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై సీరియస్ యాక్షన్ మొదలుపెట్టారు. ఈ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న అనేక మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, హీరోలను సైతం పోలీసులు వదలడం లేదు.
Also Read: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
అనన్య మాట్లాడుతూ..
ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి సహా మరికొందరు టాలీవుడ్ స్టార్లపై కేసులు నమోదు అవ్వగా, తాజాగా ఈ బెట్టింగ్ యాప్ ఉచ్చులో మరో హీరోయిన్ అనన్య నాగళ్ల(Ananya Nagalla) కూడా ఇరుక్కుంది. సోషల్ మీడియా వేదికగా తన తప్పును ఒప్పుకుంది. తాను ప్రమోట్ చేసిన ఒక వెబ్ సైట్ వల్ల జరిగిన నష్టాన్ని తాను తెలుసుకున్నట్లు వెల్లడించింది. . అనన్య మాట్లాడుతూ.. "అవగాహన లేక, తెలిసి తెలియక తానూ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసానని, తరువాత తప్పు తెలుసుకొని తన వల్ల నష్టపోయిన వారందరికి తాను డబ్బులు తిరిగి ఇచ్చినట్లు" వెల్లడించింది.
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
"ఒక వీడియో స్టోరీ పోస్ట్ చేసినందుకు నాకు రూ. 1.20 లక్షలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఈ యాప్స్ వల్ల నష్టం జరుగుతుందని తెలుసుకున్నాక, నాకు తప్పేంటో స్పష్టంగా అర్ధమయ్యింది. ఇకపై నేను ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయను" అని స్పష్టం చేసింది. తానూ చేసిన పనికి క్షమాపణ కోరుతూ విరవరణ ఇచ్చింది అనన్య నాగళ్ల.
Also Read: బెట్టింగ్ యాప్స్ కేసు.. విష్ణుప్రియ షాకింగ్ పోస్ట్.. కంగుతిన్న నెటిజన్స్!