Priya Bapat : స్క్రిప్ట్‌లో లేకపోయినా పదే పదే ముద్దు పెట్టి వేధించాడు :  నటి సంచలన కామెంట్స్!

తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని తాజాగా బయటపెట్టింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో సహ నటుడు స్క్రిప్ట్‌లో లేకపోయినా.. ఇంప్రూవైజేషన్ పేరుతో పాట సీక్వెన్స్‌లో తనను పదే పదే ముద్దు పెట్టుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది

New Update
priya

మరాఠీ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా బాపట్.. తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని తాజాగా బయటపెట్టింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో సహ నటుడు స్క్రిప్ట్‌లో లేకపోయినా.. ఇంప్రూవైజేషన్ పేరుతో పాట సీక్వెన్స్‌లో తనను పదే పదే ముద్దు పెట్టుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో తనకు చాలా ఇబ్బందిగా అనిపించినా, ఎలా స్పందించాలో.. తన కోసం తాను ఎలా నిలబడాలో అర్థం కాలేదని చెప్పింది.

సంచలన విషయాలు

 ఓ ఇంటర్వ్యూలో ప్రియా బాపట్ ఈ సంచలన విషయాలను పంచుకుంది. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ జరుగుతున్నప్పటి నుంచే ఆ ముద్దు సీన్‌పై నాకు అభ్యంతరాలు ఉన్నాయి. అసలు ఆ సీన్ సినిమాకు అంత అవసరమా? కథకు అది న్యాయం చేస్తుందా? అని నేను డైరెక్టర్‌ను కూడా పదే పదే ప్రశ్నించాను. కానీ షూటింగ్ సమయంలో ఆ నటుడి ప్రవర్తన ముందే ప్లాన్ చేసుకున్న సీన్ పరిధిని దాటిపోయింది. ఆ సాంగ్ సీక్వెన్స్‌లో అతను ఇంప్రూవైజ్ చేస్తున్నానంటూ నన్ను పదే పదే ముద్దు పెట్టుకున్నాడు. అప్పట్లో నాకు ఏం చేయాలో పాలుపోలేదు. నా కోసం నేను గట్టిగా స్టాండ్ తీసుకోలేకపోయాను అని పేర్కొంది.

ఆ ఇబ్బంది కేవలం షూటింగ్‌తోనే ఆగిపోలేదని ప్రియా తెలిపింది. షూటింగ్ షెడ్యూల్ జరుగుతున్న సమయంలో వాళ్లిద్దరూ ఒకే హోటల్‌లో బస చేశారు. తాను ఎన్నిసార్లు నిరాకరించినా.. ఆ సహ నటుడు పదే పదే తనను బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌కు రావాలంటూ వేధించేవాడని గుర్తుచేసుకుంది.

ఈ ఘటనతో తాను మానసికంగా తీవ్ర ఆందోళనకు గురయ్యానని, ప్రతిరోజూ రాత్రి తన భర్త ఉమేష్ కామత్‌కు ఫోన్ చేసి ఏడ్చేదాన్నని ప్రియా చెప్పింది. భార్య పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయిన ఉమేష్ కామత్.. వెంటనే ముంబై నుంచి ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న భోపాల్‌కు ఫ్లైట్ ఎక్కి వచ్చేశాడు. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆమెకు అండగా అక్కడే ఉన్నాడని ప్రియా బాపట్ వెల్లడించింది.

మరాఠీ చిత్ర పరిశ్రమలో పాపులర్ హీరోయిన్ అయిన ప్రియా బాపట్.. ఓటీటీ స్పేస్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న కాక్‌స్పర్శ్ సినిమాతో పాటు, హాట్ స్టార్‌లో వచ్చిన పొలిటికల్ డ్రామా సిరీస్ 'సిటీ ఆఫ్ డ్రీమ్స్ లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే హ్యాపీ జర్నీ (2014), ఆమ్హీ దోఘీ (2018), అంధేరా, సోనీలివ్ సిరీస్ రాత్ జవాన్ హై వంటి ప్రాజెక్టులలో ఆమె నటించింది. 

Advertisment
తాజా కథనాలు