మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్‌ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్‌ డే స్పెషల్!

మాటలతోనే ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. సీన్ ఎంత పెద్దదైనా తన డైలాగ్స్ తో కన్విన్స్ చేయడం ఆయనకే సాధ్యం. అందుకే ఆయనను సినీ ప్రియుల మాటల మాంత్రికుడు అని పిలుస్తారు. నేడు ఈ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు.

New Update
Trivikram: గేర్ మారుస్తున్న గురూజీ.. ఫ్యామిలీ గొడవలు వదిలేసి దానిపై ఫోకస్ పెడుతున్నాడట?

Trivikram Srinivas

Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ రచయత పోసాని దగ్గర రచయితగా మొదలైన ఆయన ప్రయాణం.. ఇండస్ట్రీలోనే అగ్ర దర్శకుడిగా పేరు పొందిన స్థాయికి వెళ్ళింది. ‘స్వయంవరం'  సినిమాకు రచయితగా కెరీర్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్  .. ఆపై విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ‘నువ్వే కావాలి’ సినిమాలో తన పదునైన మాటలతో రైటర్ గా తానేంటో  ప్రూవ్ చేసుకున్నాడు. 

 'నువ్వే నువ్వే' సినిమాతో డైరెక్టర్ గా 

ఆ  తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావు’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’  సినిమాలు ఒక దానికి మించి మరొకటి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి.  'నువ్వే నువ్వే' సినిమాతో పూర్తి  డైరెక్టర్ గా అవతరించిన త్రివిక్రమ్.. ఆ తర్వాత వచ్చిన అతడు, జల్సా, ఖలేజా సినిమాల్లో తన మాటల మ్యాజిక్ తో ప్రేక్షకులను ఫిదా చేశాడు. దర్శకుడి కంటే ఆయనలోని రచయితను ఎక్కువగా ఇష్టపడేంతలా  ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. 

 Also Read : 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికేయన్

Trivikram Srinivas : ఈ జనరేషన్ సినీ ప్రపంచానికి అతనొక టార్చ్ బేరర్

ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్స్ 

  'ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలుకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్‌ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్‌ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్‌ అంటారు. కానీ, ప్రతి జనరేషన్‌లోనూ ఆ కొత్త థాట్‌ను ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు.. వాడినే టార్చ్‌ బేరర్‌ అంటారు, 'మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి. కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు',  'బాధలో ఉన్నవాడిని ఎలా ఉన్నావ్‌ అని అడగడం అమాయకత్వం. బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగటం అనవసరం' అంటాడు. 'కారణం లేని కోపం, ఇష్టం లేని గౌరవం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం' వంటి  పదునైన డైలాగ్స్ ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి. మాటలతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడంలో ఆయనకు ఎవరూ సాటి లేరని అనిపించుకున్నారు. 

2018 అజ్ఞాతవాసితో విమర్శపాలైనా త్రివిక్రమ్.. అదే ఏడాదిలో 'అరవింద సమేత'  సినిమాతో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాలోని 'టార్చ్ బేరర్'  ట్రెండ్ గా నిలిచింది. డైలాగ్ ఆ తర్వాత 'అల వైకుంఠపురం' తో  బాక్స్ రికార్డులను షేక్ చేశాడు. 

Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijay Devarakonda: "లవ్‌ యూ అన్నా".. అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ సర్ప్రైజ్‌ గిఫ్ట్‌..

విజయ్‌ దేవరకొండ హైదరాబాద్ లో తన కొత్త రౌడీ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా అల్లు అర్జున్‌ కు గిఫ్ట్‌ పంపగా, బన్నీ‘‘స్వీట్‌ బ్రదర్‌’’ అంటూ స్పందించాడు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం మరోసారి హైలైట్ అయింది.

New Update
Vijay Devarakonda - Allu Arjun

Vijay Devarakonda - Allu Arjun

Vijay Devarakonda: టాలీవుడ్‌ యూత్ ఐకాన్ అల్లు అర్జున్‌(Allu Arjun), రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఇద్దరూ మంచి స్నేహితులని సినీ పరిశ్రమలో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇద్దరికీ ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరిపై ఒకరికి ఉన్న సాన్నిహిత్యాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలిపారు.

Also Read: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్‌ ది వే..!

మై స్వీట్‌ బ్రదర్‌..

హైదరాబాద్‌లో తన "రౌడీ" బ్రాండ్ స్టోర్‌ను(Rowdy Brand Store) ప్రారంభించిన విజయ్‌ దేవరకొండ, ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కి ప్రత్యేకంగా బ్రాండ్‌కు చెందిన దుస్తులు, పిల్లల కోసం బర్గర్లను గిఫ్ట్‌గా పంపారు. ఈ చిన్న సర్ప్రైజ్‌ బన్నీ మనసును గెలుచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ గిఫ్ట్ ఫొటోను షేర్ చేస్తూ, "మై స్వీట్‌ బ్రదర్‌.. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఆశ్చర్యపరుస్తూ ఉంటావు. సో స్వీట్‌!" అంటూ అల్లు అర్జున్‌ హృదయపూర్వకంగా స్పందించాడు.

Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి

ఇది తొలిసారి కాదు ‘పుష్ప 2’ విడుదల సమయంలో కూడా విజయ్‌ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘పుష్ప’ టీషర్ట్‌లు బన్నీకి పంపిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా అల్లు అర్జున్‌ ఆనందంతో, ‘‘నా స్వీట్‌ బ్రదర్‌.. నీ ప్రేమకు ధన్యవాదాలు’’ అంటూ అభినందించాడు. దీనికి విజయ్‌ దేవరకొండ ‘‘లవ్ యూ అన్నా.. మన స్నేహం ఇలానే కొనసాగుతుంది’’ అని రిప్లై ఇచ్చాడు.

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న భారీ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ అనే స్పై థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు, దీనిని గౌతమ్‌ తిన్ననూరి డైరెక్ట్‌ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment