రేప్ కేసు విషయంలో ఏం జరిగిందో చెప్పిన హర్ష సాయి..!

నార్సింగి పీఎస్ లో తనపై అత్యాచార కేసు నమోదు కావడంపై యూట్యూబర్ హర్ష సాయి స్పందించాడు. డబ్బు కోసమే ఆ అమ్మాయి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. తానేంటో తన ఫాలోవర్స్ కు తెలుసని ఇన్స్టా లో పోస్ట్ పెట్టారు.

New Update
harsha sai

harsha sai

Harsha Sai :  ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్ష సాయి మోసం చేశాడని నార్సింగ్ పోలీసు స్టేషన్‌‌లో కేసు పెట్టింది.  హర్ష సాయితో పాటు అతని తండ్రిపై కూడా  కంప్లైంట్ ఇచ్చింది. పెళ్లి పేరుతో రూ. 2కోట్లు తీసుకొని తనను  మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Also Read: NTR: రండి నాతో చేతులు కలపండి.. డ్రగ్స్ రహిత సమాజమే తెలంగాణ లక్ష్యం!

ఆరోపణల పై స్పందించిన హర్ష సాయి

అయితే తాజాగా యూట్యూబర్ హర్ష సాయి తనపై చేసిన ఆరోపణలపై స్పంచించాడు. కేవలం డబ్బు కోసమే  తనపై ఆరోపణలు చేస్తున్నారని. త్వరలోనే అసలు నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. తానేంటో తన ఫాలోవర్లకు తెలుసని.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతని లాయర్ తనికొండ చిరంజీవి వెల్లడిస్తారని ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. 

Also Read: ఓటీటీలోకి నారా రోహిత్ పొలిటికల్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

HARSHA

యూట్యూబర్ గా పాపులారిటీ 

హర్ష సాయికి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ ద్వారా తనకు వచ్చిన డబ్బుతో పేదలకు సహాయం చేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతుంటాడు. అయితే హర్ష సాయి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన డబ్బులతోనే ప్రజలకు సహాయం చేస్తున్నాడనే విమర్శలు కూడా ఉన్నాయి. అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది యూత్ వాటికి బానిసై చనిపోయారని సోషల్ మీడియా పెద్ద రచ్చనే జరిగింది.  ఇది ఇలా ఉంటే ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై సైతం లైంగిక ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. అతని దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు కేసు నమోదైంది. ప్రస్తుతం జానీ మాస్టర్ రిమాండ్ లో ఉన్నారు. 

Also Read :  కమలా హారిస్‌ ప్రచార కార్యాలయం పై కాల్పులు!

Also Read: Chiranjeevi: క్లాస్‌ అయినా మాస్‌ అయినా బాస్‌ బ్రేక్‌ డ్యాన్స్‌ వేస్తే బాక్సులు బద్దలవ్వాల్సిందే..!

#youtuber #harsha-sai #instagram
Advertisment
Advertisment
తాజా కథనాలు