Pawan Kalyan: హరీష్ శంకర్ కు పవన్ ఆర్డర్స్.. 'ఉస్తాద్ భగత్‌ సింగ్‌' స్క్రిప్ట్‌లో మార్పులు?

'ఉస్తాద్ భగత్ సింగ్' స్క్రిప్ట్‌కి సంబంధించి మార్పులు చేస్తున్న‌ట్లు న్యూస్ బయటికొచ్చింది. కొన్నిరోజుల కింద హరీష్‌ను పిలిపించిన పవన్.. స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని సూచించారట. అంతేకాదు డైలాగ్స్‌కు వెర్షన్​ను కూడా మార్చమని పవన్ కోరినట్లు తెలుస్తోంది.

New Update
ustaad

హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కొంతవరకు షూటింగ్ జరుపుకోగా.. ఇటీవల ఏపీ ఎలక్షన్స్ వ‌ల‌న వాయిదా ప‌డింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. 

Also Read :  ఆమె జాగ్రత్త.. ఇదే నా లాస్ట్‌ వీకెండ్‌: రష్మిక పోస్ట్ వైరల్!

ఈ క్ర‌మంలోనే ఈ మూవీ సంబంధించి ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్‌కి సంబంధించి మార్పులు చేస్తున్న‌ట్లు న్యూస్ బయటికొచ్చింది. ఈ సినిమాకు సంబంధించి మార్పులు చేయ‌మ‌ని హరీశ్‌ను ప‌వ‌న్ కోర‌గా.. హరీశ్ ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తుంది.

Also Read :  ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Also Read : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్..?

డైలాగ్స్ వెర్షన్ కూడా..

కొన్ని రోజుల క్రితం హ‌రీశ్ శంక‌ర్ ప‌వ‌న్‌ను కలవగా.. ఈ మార్పులు గురించి చర్చ వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో డైలాగ్స్‌కు సంబంధించి కూడా వాటి వెర్షన్​ను మార్చమని పవన్ కోరారని, అందుకు తగ్గట్లు హరీశ్ స్క్రిప్ట్ రీవర్క్ చేస్తున్నారని సమాచారం. 

అతి త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. 'గబ్బర్ సింగ్' తో కమర్షియల్ గా బిగ్ సక్సెస్ అందుకున్న హరీష్ శంకర్.. ఈసారి 'ఉస్తాద్ భగత్ సింగ్' తో అదిరిపోయే సోషల్ మెసేజ్ ఇవ్వనున్నారట. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : 'పుష్ప2' ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ ఫైనల్.. బన్నీతో స్టెప్పులేసేది ఎవరంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Salim Akhtar : బాలీవుడ్లో విషాదం.. తమన్నా నిర్మాత కన్నుమూత!

బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ కన్నుమూశారు. 87 ఏళ్ల అక్తర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాణీ ముఖర్జీ,తమన్నాలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే.  

New Update
thamanna producer

thamanna producer

బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్ కన్నుమూశారు. 87 ఏళ్ల అక్తర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్టార్ హీరోయిన్లుగా వెలుగు చూసిన రాణీ ముఖర్జీ,తమన్నాలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే.  

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

చాంద్ సా రోషన్ చెహ్రా చిత్రంతో

1980, 1990లలో అమిర్ ఖాన్, బాబీ డియోల్, మిథున్ చక్రవర్తిలతో ఆయన వరుసగా సినిమాలు చేసేవారు. 'చోరోన్ కి బారాత్', 'ఖయామత్', 'లోహా', 'పార్టీషన్', 'ఫూల్ ఔర్ అంగారే', 'బాజీ', 'ఇజ్జత్' మరియు 'బాదల్' వంటి చిత్రాలకు సలీం గుర్తింపు తెచ్చుకున్నారు. రాణి ముఖర్జీ 1997లో నిర్మాత సలీం చిత్రం రాజా కీ ఆయేగీ బారాత్‌తో రంగప్రవేశం చేయగా, తమన్నా భాటియా 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా చిత్రంతో బాలీవుడ్ చిత్ర  పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

సలీం అక్తర్ షామా అక్తర్‌ను వివాహం చేసుకున్నాడు.  ఏప్రిల్ 09 బుధవారం జోహార్ ప్రార్థనల తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు ఇర్లా మసీదు సమీపంలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

 

Advertisment
Advertisment
Advertisment