'పుష్ప2' లో సుక్కు చేసిన పనికి ఫ్యాన్స్ హర్ట్..ఏకంగా సినిమానే బ్యాన్?

'పుష్ప2' సినిమాపై మలయాళీ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సుకుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో సుక్కు చేసిన ఓ పనికి హర్ట్ అయిన అభిమానులు.. ఏకంగా సినిమానే బ్యాన్ చేసే పనిలో పడ్డారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికలో..

New Update
fahad (1)

అల్లు అర్జున్ 'పుష్ప2' కు ఎంత పాజిటివ్ టాక్ వచ్చిందో అంతే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఫ్యాన్స్ కి ఈ సినిమా ఐ ఫీస్ట్ అని చెప్పడంలో సందేహం లేకపోయినా.. నార్మల్ ఆడియన్స్ లో ఓ వర్గం మాత్రం సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సుకుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాలో సుక్కు చేసిన ఓ పనికి హర్ట్ అయిన అభిమానులు.. ఏకంగా సినిమానే బ్యాన్ చేసే పనిలో పడ్డారు. పూర్తి వివరాల్లోకెళ్తే..

'పుష్ప2' చూసిన చాలామంది సినిమాలో అల్లు అర్జున్ తప్పా ఇంకేం లేదని చెప్పారు. దానికి తోడు బన్నీని హైలైట్ చేసే క్రమంలో సుకుమార్ ఇతర నటులను ఏమాత్రం పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ లాంటి నేషనల్ యాక్టర్ ను ఇందులో కమెడియన్ ను చేయడంతో పాటూ ఘోరంగా అవమానించాడు. 

సుకుమార్ పై మలయాళ ఫ్యాన్స్ ఫైర్..

దీనిపై మలయాళ ఫ్యాన్స్ తో పాటూ ఫహాద్ ఫాజిల్ ను అభిమానించే నెటిజన్స్.. సుకుమార్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మలయాళ ఫ్యాన్స్ అయితే ఏకంగా  సినిమాను బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. సుక్కులాంటి ఒక హై స్టాండర్డ్ డైరెక్టర్ స్విమ్మింగ్ పూల్ లో ఫహాద్ ని తోసేసి అల్లు అర్జున్ చేత ఉచ్చ పోయించే లాంటి సీన్లు పెట్టారంటే తప్పకుండా ఇది సుక్కు లైఫ్ లోనె ఒక బ్లాక్ మార్క్. 

బయటకి చెప్పుకోలేకపోయినా తన లైఫ్ టైం రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటాడు. ఈ సినెమా అల్లు అర్జున్ ఫేక్ ఇమేజ్ రిప్రెజెంట్ చేసుకోవడానికి చూపించుకున్న సిద్ధం సభలాంటిదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మలయాళ ఫ్యాన్స్ అయితే  స్వచ్చందగా 'పుష్ప2' ను బ్యాన్ చేశారు. అణుడికే మలయాళ వెర్షన్ బుక్ మై షో యాప్ లో అన్ని టికెట్లు ఖాళీగానే ఉన్నాయని, ఇందుకు సంబంధించి పలు స్క్రీన్ షాట్స్ ను నెట్టింట షేర్ చేస్తున్నారు.

Also Read : డబ్బులు తక్కువిచ్చినా పర్లేదు కానీ ఫ్రీగా ఆ పని చేయను.. రష్మిక షాకింగ్ కామెంట్స్

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Prabhas Spirit: బుర్రపాడు భయ్యా.. ప్రభాస్‌ ‘స్పిరిట్’లో ‘వైలెంట్ హీరో’ - రచ్చ రచ్చే!

ప్రభాస్ - సందీప్ రెడ్డివంగ కాంబో ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో మలయాళ స్టార్ ‘మార్కో’ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అతడు కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

New Update
unni mukundan key role in prabhas spirit

unni mukundan key role in prabhas spirit

రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. వీటి తర్వాత ప్రభాస్ లైనప్‌లో స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలు ఉన్నాయి. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

అయితే వీటిలో ముందుగా సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే ‘స్పిరిట్’ మూవీపైనే అందరి చూపులు ఉన్నాయి. యానిమల్ మూవీతో తన మార్క్ చూపించిన సందీప్‌ ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తీస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ ఆసక్తిక విషయాలు వెల్లడించి హైప్ పెంచేశాడు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

పోలీస్ పాత్రలో

ఇందులో ప్రభాస్ లుక్ చూస్తే అందరి మతులు పోతాయని తెలిపాడు. ఇప్పటి వరకు ఎవరూ చూపించని లుక్కులో డార్లింగ్‌ను చూపిస్తానని గత ఇంటర్వ్యూలలో చాలాసార్లు చెప్పాడు. దీంతో అందరూ ఇప్పుడు ఈ సినిమా కోసమే చూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో అంతా ఇప్పుడు ఈ చిత్రం కోసమే మాట్లాడుకుంటున్నారు. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

కీ రోల్‌లో స్టార్ హీరో

ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా మరొక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ‘మార్కో’ హీరో  ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అతడు కీ రోల్‌ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

spirit | Prabhas Spirit | prabhas | director-sandeep-reddy-vanga | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment