శ్రీవారి సేవలో ప్రేమజంట దువ్వాడ, మాధురి.. వీడియో వైరల్ ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు ఓపెన్ అయిపోయారు. సన్నిహితులతో కలిసి తిరుమలలో ప్రత్యక్ష్యం అయ్యారు. ఇద్దరూ కలిసి జంటగా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. By Seetha Ram 07 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి దువ్వాడ శ్రీనివాస్, వాణి, మాధురిల వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో కలిసి జీవిస్తున్నాడనే అనుమానంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, ఆమె బిడ్డలు ఇంటిముందు బైఠాయించారు. ఈ విషయంపై నోరు విప్పిన దివ్వెల మాధురి తాను దువ్వాడ శ్రీనివాస్‌కి ఒక ఫ్రెండ్ మాత్రమేనని మీడియా ముందు తెలిపారు. అయితే మరోవైపు దువ్వాడ శ్రీను మాత్రం తాను తన భార్య వాణితో కలిసి జీవించడం లేదని.. మాధురితో జీవిస్తున్నానని తెలిపాడు. ఇలా శ్రీనివాస్, వాణి, మాధురిల వివాదం ప్రతి రోజూ పెరుగుతూ వచ్చింది. ఇది కూడా చదవండి: దసరా స్పెషల్.. ఈ వారం థియేటర్/ ఓటీటీలో సందడే సందడి.. అయితే భార్య పిల్లలతో వివాదం తర్వాత ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు ఓపెన్ అయిపోయారు. దువ్వాడ, మాధురితో సన్నిహితంగా కలిసి తిరుగుతున్నాడు. రీసెంట్‌గానే ఈ ఇద్దరు స్కూటీపై వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇప్పుడీ జంట మరోసారి దర్శనమిచ్చింది. ఒక్కటైన ప్రేమజంట ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగ జరుగుతున్నాయి. మాడవీధుల్లో వాహనాలపై ఊరేగే దేవతామూర్తులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అదే సమయంలో దువ్వుడ శ్రీనివాస్, మాధురి సన్నిహితులతో కలిసి తిరుమలలో ప్రత్యక్ష్యం అయ్యారు. ఇద్దరూ కలిసి జంటగా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇది కూడా చదవండి: జానీ మాస్టర్ కేసు వెనుక కుట్ర జరుగుతోంది: శేఖర్ బాషా ఆపై బయటకు వస్తున్న క్రమంలో చాలా మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. కాగా మరో వైపు దువ్వాడ శ్రీనివాస్, వాణితో విడాకులకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా తనకు కూడా విడాకులు ఇవ్వాని వాణి విజ్ఞప్తి చేసింది. ఈ తరుణంలో దువ్వాడ, మాధురి కలిసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. #duvvada-srinivas #divvela-madhuri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి