డోరెమాన్‌కు వాయిస్‌ ఇచ్చిన నటి మృతి

యానిమేటెడ్ కార్టూన్‌లలో డోరెమాన్‌ ఒకటి. ఈ డోరెమాన్‌‌కు వాయిస్‌ ఇచ్చిన జపనీస్ వాయిస్ ఆర్టిస్ట్ నోబుయో ఒయామా ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తాజాగా తెలిపారు. ఆలస్యంగా చెప్పినందుకు ఒయామా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. 

New Update
Doraemon

మీరు యానిమేటెడ్ కార్టూన్‌లలో ఒకటైన డోరెమాన్ చూస్తారా? అందులో డోరెమాన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది కదూ. షుజుకా, నోబితా తమ అల్లరి చేష్టలతో ప్రమాదంలో పడినపుడు డోరెమాన్ వారిని సేవ్ చేస్తూ పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా ఆ డోరెమాన్‌ వాయిస్ పిల్లలను బాగా నవ్విస్తుంది.

నోబుయో ఒయామా

అయితే ఆ డొరెమాన్‌ పాత్రకు వాయిస్ ఇచ్చిన జపనీస్ వాయిస్ ఆర్టిస్ట్ నోబుయో ఒయామా 90వ ఏటా తుది శ్వాస విడిచారు. ఆమె మరణించి చాలా రోజులే అవుతున్నా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నోబుయో ఒయామా.. 1979 - 2005 వరకు డోరెమాన్‌కు వాయిస్ అందించారు. ఆమె వృద్ధప్య సమస్యల కారణంగా 2024 సెప్టెంబర్ 29న మరణించారు.

ఇది కూడా చదవండి: వామ్మో పిల్లలూ జాగ్రత్త.. బిస్కెట్‌లో ఐరన్ వైర్.. వీడియో చూశారా?

అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటివరకు వెల్లడించలేదు. తాజాగా ఓ ప్రకటనను వారు విడుదల చేశారు. అందులో నోబుయో ఒయామా వృద్ధాప్య సమస్యలతో మరణించినట్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఆలస్యంగా చెప్పినందుకు ఒయామా అభిమానులకు క్షమాపణలు తెలిపారు. 

ఇది కూడా చదవండి: విషాదం.. భర్త, ఇద్దరు కుమారుల మృతి.. ‘మీరు లేని జీవితం నాకొద్దు’

కాగా నోబుయో 1933లో జన్మించారు. 1960లో ఆమె తన కెరీర్ స్టార్ట్ చేశారు. సినిమాలు, సిరీస్‌లు, పలు షోలలో వివిధ పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. అనంతరం 1964లో సహ నటుడైన కీసుకే సగావాను మ్యారేజ్ చేసుకున్నారు. ఆపై 1979లో డోరెమాన్ ప్రారంభం అయింది.

ఇది కూడా చదవండి: ఫైరింగ్‌ ప్రాక్టీస్‌లో విషాదం.. ఇద్దరు అగ్నివీరులు మృతి

ఇక అప్పటి నుంచి 2005 వరకు ఆమె డోరెమాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని 2010లో హిట్ వీడియో గేమ్ సిరీస్ డంకన్‌రోన్పాలో మోనోకుమార్ పాత్రకు వాయిస్ ఇచ్చింది. కాగా ఆమె భ్త కీసుకే 2017లో మరణించారు. కాగా ఆమె మృతిపై అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.   

Advertisment
Advertisment
తాజా కథనాలు