/rtv/media/media_files/2024/11/28/agXgtpTl0Chd4tjr5sfI.jpg)
All We Imagine As Light : కేరళ యువ నటి దివ్య ప్రభ ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమాలో నగ్నంగా నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ చిత్రంలో 'కని కుశృతి' ప్రధాన పాత్రలో అభిమానులను అలరించిన దివ్య.. ఇంటిమేట్ సీన్స్ నెట్టింట వైరల్ గా మారడపై కూడా సంతోషం వ్యక్తం చేసింది.
Also Read : భయపడొద్దు పులి పారిపోయింది.. చిరుత సంచారంపై అటవిశాఖ క్లారిటీ!
Also Read : అదానీ ఇష్యూలో జగన్ పరువు నష్టం దావా.. వారందరికీ లీగల్ నోటీసులు!
పాత్రలో జీవించడానికి ప్రయత్నిస్తా..
ఈ మేరకు నవంబర్ 22న విడుదలై అభిమానులను ఊర్రూతలుగిస్తున్న మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న దివ్య.. తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ పై మాట్లాడింది. ‘నేను ఎన్నో స్టోరీస్ వింటూనే ఉంటా. కానీ నాకు కథ నచ్చితేనే ఒకే చేబుతా. పాత్రలో జీవించడానికి ప్రయత్నిస్తా. ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ మూవీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఇందులో ఓ న్యూడ్ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
Also Read : వివాహేతర సంబంధం తప్పుకాదు కానీ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
చాలామంది దానిని షేర్ చేస్తున్నారు. వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారో.. వారి ఆలోచనా విధానం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నేను గుర్తింపు కోసమే న్యూడ్ సీన్ లో నటించానని దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు నేను ఈ సినిమా కంటే ముందే ఎన్నో అవార్డులు గెలుచుకున్నా. ప్రశంసలు అందుకున్నా. పేరు కోసం ఇలాంటి సీన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇలా జరుగుతుందని ముందే ఊహించా. అయినా తప్పు చేయనపుడు నేనెందుకు బాధపడాలి' అంటూ తనను తాను సమర్ధించుకుంది.
Also Read : Maharashtra Elections: మీ కూటమికో దండం..కాంగ్రెస్ కు శివసేన బిగ్ షాక్?